Asianet News TeluguAsianet News Telugu

బ్రిడ్జీ కింద చిక్కుకున్న ఎయిర్ ఇండియా విమానం.. వైరల్ వీడియోపై అధికారుల రియాక్షన్ ఇదే!

ఆకాశంలో ఎగరాల్సిన విమానం ఢిల్లీ-గురుగ్రాం హైవేపై కనిపించింది. ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జీ కింద చిక్కుకుపోయింది. దీనికి సంబంధించిన ఆదివారం ఈ వీడియో వైరల్ అయింది. దీంతో ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు.
 

air india flight stuck at bridge in delhi
Author
New Delhi, First Published Oct 4, 2021, 2:54 PM IST

న్యూఢిల్లీ: ఆకాశంలో ఎగరాల్సిన విమానం హైవేపైకి వచ్చిందేంటి చెప్మా.. అన్నట్టు ఓ వీడియో తెగ వైరల్ అవుతున్నది. ఫుట్ ఓవర్ బ్రిడ్జీ కింద నడిరోడ్డుపై ఎయిర్ ఇండియా విమానం చిక్కుకుంది. దాని పక్కన ఇతర వాహనాలు వెళ్లిపోతున్నాయి. కానీ, ఆ విమానం కదలదు. మెదలదు సరిగ్గా బ్రిడ్జీ కిందకు వచ్చి ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోపై నెటిజన్లు విరివిగా కామెంట్లు చేయడం, షేర్ చేయడంతో విషయం ఎయిర్ ఇండియా అధికారుల వరకూ చేరింది. వారు ఈ వీడియోపై స్పందించారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు సమీపంలో ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై ఈ ఘటన జరిగింది. 

ఈ విమానాన్ని తాము అమ్మేశామని అధికారులు వివరించారు. దాని కొత్త యజమాని ఆ విమానాన్ని తీసుకెళ్తున్నారని తెలిపారు. సాధారణంగా పాత విమానాలను స్క్రాప్ డీలర్లకు అమ్మేస్తారని ఓ ఎయిర్‌లైన్ అధికారి చెప్పారు. తద్వార ఆ విమానంలోని విలువైన లోహాలను వెలికి తీస్తారని తెలిపారు.

 

ఆ విమానాన్ని తీసుకెళ్లే బాధ్యత కొత్త యజామానిదేనని దానికి ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధం లేదని ఆ అధికారి చెప్పారు. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము అమ్మిన విమానాన్ని స్క్రాప్ డీలర్ నిన్న రాత్రే తీసుకెళ్లారని, ఎయిర్ ఇండియాకు ఈ ఘటనతో సంబంధం లేదని వివరించారు. ఈ విమానాన్ని తీసుకెళ్లడానికి ముందు దాని రెక్కలు సహా కొన్ని కీలక పరికరాలను తొలగించినట్టు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios