విమానంలో పేలిన మొబైల్ ఫోన్.. ఎయిర్ ఇండియా ఫైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India flight: ఎయిరిండియా విమానానికి సంబంధించి వార్త వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం (Air India flight ) ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ప్రయాణికుడి మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

Air India flight: ఎయిరిండియా విమానం మరోసారి వార్తల్లో నిలిచింది. ఉదయ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానంలో ప్రయాణికుడి మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ సమయంలో ప్రయాణీకుడి మొబైల్ పేలింది, ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేయబడింది.
నివేదిక ప్రకారం.. విమానంలోని ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.విమానాశ్రయంలో విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విమానాశ్రయ సిబ్బంది మరియు ఎయిర్ ఇండియా ఇంజనీర్ల బృందం విమానాన్ని పూర్తి సాంకేతిక తనిఖీ చేశారు. సాంకేతిక తనిఖీ అనంతరం విమానాన్ని ఢిల్లీకి పంపించారు.
గత నెల జూన్ 21న ఇండిగో విమానం - 6E 2134 - ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కొన్ని సాంకేతిక సమస్య కారణంగా 'హెచ్చరిక సిగ్నల్' అందిన తర్వాత విమానం ల్యాండింగ్‌కు ప్రాధాన్యతనిచ్చిందని ఇండిగో వర్గాలు తెలిపాయి. ఎయిర్‌లైన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. “ఇండిగో ఫ్లైట్ 6E 2134 సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీ నుండి డెహ్రాడూన్‌కు తిరిగి వచ్చింది. పైలట్ విధానం ప్రకారం ATCకి సమాచారం అందించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభ్యరించారని పేర్కొన్నారు.