తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.. తిరుచ్చి నుంచి దుబాయ్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ప్రహరీ గోడను ఢీకొట్టి వెళ్లిపోయింది.

ఆ సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు... గోడను ఢీకొట్టినట్లు గుర్తించిన పైలట్లు విమానాన్ని ముంబైకి దారి మళ్లీంచారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు.

ఈ ఘటనలో విమానం చక్రాలు, యాంటీనా ధ్వంసమయ్యాయి. మరోవైపు గోడకు ఢీకొట్టిన తర్వాత కొంతసేపు విమానానికి ఏటీసీ సిగ్నల్స్‌తో సంబంధాలు తెగియపోయాయి. ఈ ప్రమాదం సాంకేతిక కారణాల వల్ల జరిగిందా..? లేక పైలట్ల తప్పిదమా అన్న దానిపై ఎయిరిండియా దర్యాప్తునకు ఆదేశించింది. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్ తరలించినట్లుగా అధికారులు వెల్లడించారు.