Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చిన సిబ్బంది

కేరళ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం దుబాయ్ చేేరుకున్న తరువాత అందులో పాము ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.
 

Air India flight had a snake in it.. The crew brought down all the passengers safely
Author
First Published Dec 11, 2022, 10:53 AM IST

దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కార్గో హోల్డ్‌లో పాము కనిపించింది. శనివారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (డీఎక్స్ బీ)లో విమానం ల్యాండ్ అయిన వెంటనే పాము ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. అనంతరం వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీజీఏ) విచారణకు ఆదేశించింది.

ఛత్తీస్‌గఢ్‌ లో ఘోర ప్రమాదం... ఫ్లైఓవర్‌ను ఢీకొట్టి కిందపడ్డ బైక్‌.. దంపతులు మృతి, కుమార్తెకు గాయాలు

ఎయిర్ ఇండియాకు చెందిన బీ737-800 విమానం కేరళలోని కాలికట్ నుండి శనివారం బయలుదేరింది, అయితే అది డీఎక్స్‌బీ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే దుబాయ్ ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. ప్రయాణికులందరినీ దుబాయ్ ఎయిర్ పోర్టులోకి తీసుకెళ్లారు.

ఓ ప్రయాణికుడు తాము దుబాయి విమానాశ్రయంలో 7 గంటలు చిక్కుకుపోయామని తెలుపుతూ సోషల్ మీడియాలో తన దుస్థితిని పోస్ట్ చేశాడు. దీనికి ఎయిర్ ఇండియా బదులిచ్చింది. ‘‘డియర్ సర్, మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మిమ్మల్ని హోటల్‌కి బదిలీ చేశారని మా టీం తెలియజేసింది. ఐఎక్స్344 (డీఎక్స్ బీ-సీసీజే)  11 డిసెంబర్ 2022న ఉదయం 1:45 గంటలకు బయలుదేరనుంది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ధన్యవాదాలు. ’’ అని ఎయిర్ ఇండియా బదులిచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios