Asianet News TeluguAsianet News Telugu

లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపేసిన చీమల దండు

ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ-111 బిజినెస్ క్లాస్ సెక్షన్‌లో చీమల దండు కనిపించడంతో టేకాఫ్‌ను నిలిపేశారు. ఆ విమనం స్థానంలో మరోదానిని ఎయిర్ ఇండియా లండన్‌కు పంపింది. 
 

air india aborts take off after finding ants swarm in business class
Author
New Delhi, First Published Sep 6, 2021, 7:07 PM IST

న్యూఢిల్లీ: పాఠశాలల్లో చలి చీమల చేత చిక్కి సర్పం చచ్చిపోయిందని చదువుకున్నది గుర్తున్నదా? తాజాగా, సర్పాన్ని చంపడం కాదుగానీ, చీమలకు ఎన్నో రెట్లు పెద్దగానున్న ఓ విమానాన్ని అవి నిలిపేశాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్ సెక్షన్‌లో చీమలదండు కనిపించడంతో అధికారులు టేకాఫ్‌ను నిలిపేశారు.

ఆ విమానంలో భూటాన్ రాకుమారుడు ప్రయాణించాల్సి ఉంది. రాజు జిగ్మె ఖేసర్ నాంగ్యెల్ వాంగ్‌చుక్ తనయుడు జిగ్మె నాంగ్యెల్ వాంగ్‌చుక్ ఏఐ-111 విమానంలో ప్రయాణించడానికి టికెట్ తీసుకున్నారు. కానీ, ఆ విమానంలోని బిజినెస్ క్లాస్ సెక్షన్‌లో సిబ్బంది చీమలు గుంపులుగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ విమానం టేకాఫ్‌ను నిలిపేశారు. ఎయిర్ ఇండియా మరో విమానాన్ని దాని స్థానంలో లండన్‌కు పంపింది.

గతంలోనూ ఇలాంటి ఘటనలు కొన్ని చోటుచేసుకున్నాయి. మే నెలలో ఢిల్లీ నుంచి నెవార్క్ వెళ్లాల్సిన ఓ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక అందులో ఓ గబ్బిలం ఉన్నట్టు తేలింది. ప్లేన్ లోపల గబ్బిలం ఉన్నట్టు ధ్రువీకరించడంతో పైలట్ ఆ ఫ్లైట్‌ను తిరిగి వెనక్కి తెచ్చారు. టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత గబ్బిలాన్ని గుర్తించారు. ఆ విమానం సేఫ్‌గా మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ అయింది. బిజినెస్ క్లాస్ ఏరియాలో ఆ గబ్బిలం మరణించి కనిపించింది. దీన్ని వైల్డ్ లైఫ్ స్టాప్ తీసుకెళ్లారు.

Follow Us:
Download App:
  • android
  • ios