గోవాలోని మహదేయ్ వన్యప్రాణుల అభయారణ్యంలో చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం Mi-17 హెలికాప్టర్‌ను మోహరించినట్లు తెలుస్తోంది.

గోవాలోని మహదేయ్ వన్యప్రాణుల అభయారణ్యంలో గత 6 రోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. రోజురోజుకు మంటలు మరింత దూరం వ్యాపించే ప్రమాదముంది. ఈ క్రమంలో 'లార్జ్ ఏరియా ఏరియల్ లిక్విడ్ డిస్పర్షన్ ఎక్విప్‌మెంట్'తో కూడిన ఇండియన్ నేవీ హెలికాప్టర్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనిపై రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దులోని గోవా ఈశాన్య ప్రాంతంలో ఉన్న మహదేయ్ అభయారణ్యంలోని అడవుల్లో గత 6 రోజులుగా మంటలు చేలారేగుతున్నాయి.

మంటలు ఆర్పేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మంగళ,బుధవారాల్లో పలు విమానాలను మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయని తెలిపారు. అదేసమయంలో మంటలను అదుపులోకి తీసుకరావడానికి భారత వైమానిక దళం గురువారం ఒక Mi-17 హెలికాప్టర్‌ను మోహరించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. నేటి ఆపరేషన్ లో ఈ హెలికాప్టర్ దాదాపు 22,000 లీటర్ల నీటిని మంటలార్పడానికి వినియోగించినట్టు అధికారులు తెలిపారు. 

Scroll to load tweet…

అధికారిక విడుదల ప్రకారం.. తీరప్రాంత రాష్ట్రం కేరళలోని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ మంటలర్పడానికి భారత వైమానిక దళం, భారత నౌకాదళం, పౌర పరిపాలన వ్యవస్థ సమన్వయంగా పని చేస్తున్నాయి. శుక్రవారం కూడా మంటలర్పే కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్‌లలో కూడా IAF ఇలాంటి కార్యకలాపాలను చేపట్టింది.

 అంతకుముందు.. పరిస్థితిని సమీక్షించడానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. మంటలను అగ్నిమాపక దళం, అటవీశాఖ మంటలను అదుపు చేయలేకపోయాయి. విచారణలో ఫారెస్ట్ గార్డులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ హెచ్చరించారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులను వదిలిపెట్టేది లేదని అన్నారు. 

అక్రమంగా ఉన్న జీడిపప్పు సాగు చేసేందుకు కొందరు ఉద్దేశ్యపూర్వకంగా నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించామని, సంబంధిత ఫారెస్ట్‌ గార్డుల పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఫారెస్ట్‌ గార్డు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వెంటనే సస్పెండ్‌ చేస్తానని సావంత్‌ తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి విశ్వజిత్‌ రాణే, ఎమ్మెల్యే దివ్య రాణేతో కలిసి బాధిత ప్రాంతాన్ని సందర్శించారు.

అంతకు ముందు.. మంగళవారం రాత్రి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డిఎంఎ) సమావేశానికి సావంత్ అధ్యక్షత వహించారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందించారు. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేసేందుకు నేవీ హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక , అత్యవసర సేవలు , అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారు.