Asianet News TeluguAsianet News Telugu

భారీ మొత్తంలో ప‌ట్టుబ‌డ్డ హెరాయిన్.. విలువెంతో తెలిస్తే షాక్!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై కరేబియన్‌లోని బెలిజ్‌కు చెందిన పౌరుడు అరెస్టయ్యాడు. నిందితుల నుంచి 9950 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.69.95 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు

Air customs seizes heroin worth Rs 69 cr at Delhis IGIA
Author
First Published Oct 31, 2022, 10:50 PM IST

క‌స్టమ్స్ అధికారులు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ మాఫియా ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. కొత్త మార్గాల్లో డ్రగ్స్‌ను దేశ విదేశాలకు అక్ర‌మంగా త‌ర‌లిస్తూ.. కస్టమ్స్ అధికారులకు అడ్డంగా పట్టు బడుతున్నారు. భారీ మొత్తంలో డ్రగ్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మరి పట్టుబడని డ్రగ్స్ ఇంకెంత స్థాయిలో దేశాలు దాటుతున్నాయో. తాజాగా దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ఎత్తున కస్టమ్స్‌ అధికారులు 9950 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. కరేబియన్‌లోని బెలిజ్‌కు చెందిన ఓ వ్యక్తి  నుంచి భారీ మొత్తంలో హెరాయిన్ ను ప‌ట్టుకున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్‌లో రికవరీ చేసిన హెరాయిన్‌ విలువ రూ.69.95 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ జాయింట్‌ కమిషనర్‌ నిషా గుప్తా తెలిపారు. నిందితుడు జోహన్నెస్‌బర్గ్ నుంచి దోహాకు, ఆపై న్యూఢిల్లీకి వచ్చాడని తెలిపారు. అతని ట్రాలీ బ్యాగ్‌ని సోదా చేయగా.. భారీ మొత్తం హెరాయిన్  
దొరికింది. ట్రాలీ బ్యాగ్ దిగువన, పైభాగంలో ఏర్పాటు చేసిన భాగంలో నిందితులు సరుకును దాచారు.

వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులను ద్వారకా జిల్లా నార్కోటిక్ స్క్వాడ్ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కిలోకు పైగా హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు కోటి పైనే ఉంటుందని చెబుతున్నారు. పోలీసులు వారిని విచారించి డ్రగ్స్ వ్యాపారి కోసం గాలిస్తున్నారు.

ద్వారకా ప్రాంతంలో నార్కోటిక్స్ సరఫరాపై నార్కోటిక్ స్క్వాడ్ నిఘా ఉంచిందని పోలీసు అధికారులు తెలిపారు. అక్టోబర్ 26న ఉత్తమ్‌నగర్‌లో హెరాయిన్‌ విక్రయిస్తున్న విదేశీయుడు శామ్యూల్‌ గురించి పోలీసులకు తెలిసింది. అతను హోలీ చౌక్ సమీపంలోని హస్తల్ విహార్‌లో నివసిస్తున్నట్లు సమాచారం అందింది. అతని ఇంటిపై పోలీసు బృందం దాడి చేసింది. పోలీసు బృందాన్ని చూడగానే  అతడు పారిపోయే ప్రయత్నం చేశాడు. 
పోలీసు బృందం తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి.. ఆఫ్రికన్ దేశస్థుడు శామ్యూల్‌ను పట్టుకున్నారు. అతను నైజీరియా నివాసి. అతని వద్ద నుంచి రెండు పాలిథిన్‌లు స్వాధీనం చేసుకోగా, అందులో 907 గ్రాముల హెరాయిన్‌ లభించింది.

అదే సమయంలో నార్కోటిక్ స్క్వాడ్‌లో నియమితులైన ఏఎస్‌ఐ వినోద్‌కు అక్టోబర్ 30న జోసెఫ్ అనే విదేశీయుడు హెరాయిన్ విక్రయిస్తూ మోహన్ గార్డెన్ ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలిసింది. ఓ టీమ్‌గా ఏర్పడి పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. పోలీసు బృందాన్ని చూసిన నిందితులు వెనుక గేటు నుంచి బయటకు పరుగెత్తడం ప్రారంభించారు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి పాలిథిన్‌లో దాచిన 370 గ్రాముల హెరాయిన్‌ లభించింది. జోసెఫ్ కూడా నైజీరియా నివాసి అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios