ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిని విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీసింది. ఔరంగబాద్ జిల్లా పరిధిలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్ధుల విజయాన్ని ఎంఐఎం దెబ్బతీసింది.

ఔరంగబాద్‌ పరిధిలో ముస్లిం ఓట్లను ఎంఐఎం గణనీయంగా చీల్చింది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. ఈ స్థానాల్లో బీజేపీ, శివసేన అభ్యర్ధుల విజయం వైపుగా దూసుకుపోయారు. 

మహారాష్ట్రలో ఎంఐఎం ఈ దఫా 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఎంఐఎం అన్నింటిలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి అభ్యర్థుల మధ్యే ఎంఐఎం ముఖాముఖి పడింది. ఔరంగబాద్, బీడ్, కొల్హాపూర్, అహ్మద్‌నగర్‌ లాంటి చోట్ల మైనార్టీలు ఎంఐఎం వైపుకు మొగ్గుచూపారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

read more  మహా సీఎంగా ఆదిత్య ఠాక్రే: శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో కీలక రాజకీయ పార్టీల్లో ఒక్కటైన వంచిత్ బహుజన్ అఘాది(వీబీఏ) పార్టీ కూడ కాంగ్రెస్ కూటమి విజయావకాశాలను దూరం చేసిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.

90 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఓట్లను భారీగా చీల్చింది. మరో వైపు బీఎస్పీ ఒక స్థానంలో,  ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

మహారాష్ట్ర ఎన్నికలు ఈ పర్యాయం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శివ సేన పార్టీ వ్యవస్థాపక కుటుంబం నుంచి తొలిసారి ఒక వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రస్తుత శివ సేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తనయుడు, బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే ఈ సరి బరిలో నిలిచారు. 

read more  Huzurnagar Result: పద్మావతిపై కోదాడ కేసు ఎఫెక్ట్, అదేమిటి....

రైతుల,రైతాంగ సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నా, మోడీ ఇమేజ్ వల్ల, సరైన ప్రతిపక్షం లేని కారణంగా ఇక్కడ బీజేపీ శివ సేనల కూటమి గెలుపు నల్లేరు మీద నడకని పండితులంతా ఊహిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పార్టీ ఫిరాయింపులు ఇటు కాంగ్రెస్ ను అటు ఎన్సీపీని తీవ్రంగా నష్టపరిచాయి. 

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

read more   Huzurnagar Election Result :హుజూర్‌నగర్‌ ఫలితం.. టీఆర్ఎస్ జోరు

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది.