ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని రెండున్నర ఏళ్ల పాటు సీఎం పదవిని బీజేపీ, శివసేనలు పంచుకోవాలని శివసేన డిమాండ్ చేసింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.

గురువారం నాడు మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో  శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో సీఎం పదవిని 50:50 ఫార్మూలాను అమలు చేయాలని  శివసేన అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీతో పాటు తమ పార్టీ మధ్య ఈ రకమైన ఒప్పందం జరిగిందని ఆయన తేల్చి చెప్పారు.

read more   Maharashtra Assembly Election Results 2019: నాగ్‌పూర్ సౌత్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజ

రాష్ట్రంలో  బీజేపీ  శివసేన కూటమి  అధికారంలోకి వస్తోందని  చెప్పడంలో  ఎలాంటి సందేహం లేదని  సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు.

తమ కూటమికి ప్రజలకు  పూర్తిస్థాయి మెజారిటీని ఇస్తారని తనకు నమ్మకం ఉందని సంజయ్ రౌత్ చెప్పారు. ఈ విషయాన్ని తాను ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడుతానని సంజయ్ రౌత్ చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 63 అసెంబ్లీ సీట్లను గెలుచుకొంది. ఈ దఫా 64 అసెంబ్లీ స్థానాల్లో శివసేన ఆధిక్యంలో ఉంది.ఈ దఫా 126 అసెంబ్లీ  పోటీ చేసింది. గత ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాల్లో శివసేన పోటీ చేసింది.

read more   election result 2019 video : యమున దాటడమే మిగిలింది బిజేపీపై దుష్యంత్ కామెంట్స్

అయితే ఈ దఫా ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నాడు. శివసేన సీఎం పదవిని తమకు కూడ కేటాయించాలని డిమాండ్ చేసింది. సీఎం స్థానంలో ఆదిత్య ఠాక్రేను నిలుపుతారా అనే చర్చ తెరమీదికి వచ్చింది.సీఎం అభ్యర్ధి ఎవరనే విషయాన్ని తాను ఉద్దవ్ ఠాక్రేతో చర్చిస్తానని సంజయ్ రౌత్ ప్రకటించడం  చర్చకు తెరతీసింది. 

మహారాష్ట్ర ఎన్నికలు ఈ పర్యాయం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శివ సేన పార్టీ వ్యవస్థాపక కుటుంబం నుంచి తొలిసారి ఒక వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రస్తుత శివ సేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తనయుడు, బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే ఈ సరి బరిలో నిలిచారు. 

రైతుల,రైతాంగ సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నా, మోడీ ఇమేజ్ వల్ల, సరైన ప్రతిపక్షం లేని కారణంగా ఇక్కడ బీజేపీ శివ సేనల కూటమి గెలుపు నల్లేరు మీద నడకని పండితులంతా ఊహిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పార్టీ ఫిరాయింపులు ఇటు కాంగ్రెస్ ను అటు ఎన్సీపీని తీవ్రంగా నష్టపరిచాయి. 

read more: స్టాలిన్ జోరుకి బ్రేక్ ... దూసుకుపోతున్న అన్నాడీఎంకే

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

read more  Haryana Election Results 2019: హంగ్ దిశగా హర్యానా, బేరసారాలు షురూ...  

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది.