Asianet News TeluguAsianet News Telugu

మాకు ముగ్గురు భార్యలున్నా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం.. కానీ హిందువులు.. : ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఏఐఎంఐఎం ఉత్తరప్రదేశ్  అధ్యక్షుడు షౌకత్ అలీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. హిందూ వివాహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

AIMIM leader Shaukat Ali controversial remark on Hindu marriage
Author
First Published Oct 15, 2022, 10:54 AM IST

ఏఐఎంఐఎం ఉత్తరప్రదేశ్  అధ్యక్షుడు షౌకత్ అలీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. హిందూ వివాహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సభలో పాల్గొన్న షౌకత్ అలీ.. తాము మూడు పెళ్లిళ్లు చేసుకున్న.. తాము సమాజంలో వారికి గౌరవం ఇస్తామని చెప్పారు. అయితే హిందువులు ఒక్కరిని వివాహం చేసుకున్నప్పటికీ.. ముగ్గురు ఉంపుడుగత్తెలను కలిగి ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు వారి భార్యను గౌరవించరని ఆరోపించారు. 

‘‘మేము పెళ్లిళ్లు చేసుకుంటున్నామని ప్రజలు అంటున్నారు. మేము రెండు పెళ్లిళ్లు చేసుకున్నా.. సమాజంలో ఇద్దరి భార్యలకు గౌరవం ఇస్తాం. కానీ మీరు (హిందువులు) ఒకరిని వివాహం చేసుకుంటారు. ముగ్గురు ఉంపుడుగత్తెలను కలిగి ఉన్నారు. మీరు మీ భార్యను లేదా ఉంపుడుగత్తెలను గౌరవించరు. కానీ మాకు రెండు పెళ్లిళ్లు జరిగితే.. మేము వాటిని గౌరవంగా ఉంచుతాం.. మా పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో ఉంటాయి’’ అని షౌకత్ అలీ పేర్కొన్నారు. 

అలాగే హిజాబ్ నిషేధం అంశంపై సుప్రీం కోర్టు నిర్ణయం గురించి కూడా షౌకత్ అలీ మాట్లాడారు. ‘‘దేశంలో ఎవరు ఏమి ధరించాలో హిందూత్వ నిర్ణయించదు.. కానీ రాజ్యాంగం నిర్ణయిస్తుంది’’ అని అన్నారు. దేశంలో ఎవరు ఏం వేసుకోవాలో రాజ్యాంగం నిర్ణయిస్తుందని.. హిందుత్వ కాదని.. కానీ ఇలాంటి అంశాలను లేవనెత్తడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 

బీజేపీ నాయకులు ముస్లింను టార్గెట్ చేస్తున్నారని షౌకత్ అలీ విమర్శించారు. ‘‘మదర్సా, వక్ఫ్, హిజాబ్ వంటి సమస్యలు మాతో జరుగుతున్నాయి. ఎందుకంటే మనల్ని లక్ష్యంగా చేసుకోవడం సులభం. బీజేపీ బలహీనంగా ఉన్నప్పుడు వారు ముస్లింపై దృష్టి సారిస్తారు’’ అని ఆరోపించారు. 

ఇక, కర్టాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌లపై నిషేధాన్ని కొట్టివేయడానికి నిరాకరించిన హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గురువారం భిన్నమైన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించలేదు. విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు ఈ అంశాన్ని ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) యూయూ లలిత్‌కు నివేదించారు. సీజేఐ విచక్షణ ప్రకారం కొత్త బెంచ్‌లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios