వచ్చే ఏడాదిలోనూ కరోనా ప్రభావం.. ఎయిమ్స్ వైద్యులు

 ప్రస్తుతం చూస్తున్న సంఖ్యను గమనించినట్లయితే వచ్చే సంవత్సరంలో కొన్ని నెలల పాటు కోవిడ్ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. 

AIIMS Director Ranadeep Shocking Comments on Coronavirus

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన భారత్ లోనూ ఈ వైరస్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. రోజు రోజుకీ విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే.. ఈ ఏడాదితో కరోనా పీడ పోతుందని అందరూ భావిస్తున్నారు. అయితే.. అలా జరిగడం కష్టమేనంటున్నారు ఎయిమ్స్ వైద్యులు

2021 సంవత్సరంలోనూ కోవిడ్ ప్రభావం ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ప్రకటించారు. ప్రస్తుతం చూస్తున్న సంఖ్యను గమనించినట్లయితే వచ్చే సంవత్సరంలో కొన్ని నెలల పాటు కోవిడ్ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ‘‘2021 లో కరోనా పూర్తిగా తగ్గుతుందని చెప్పలేం.కాకపోతే ప్రభావ తీవ్రత మాత్రం తగ్గే అవకాశాలున్నాయని మాత్రం చెప్పగలం. వచ్చే సంవత్సరం తొలినాళ్లలో తగ్గే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి’’ అని గులేరియా తెలిపారు.

చిన్న చిన్న గ్రామాలకు, పట్టణాలకు కూడా కరోనా పాకుతోందని, అందుకే కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. దీనిని తాము ముందే ఊహించామని, కరోనా తగ్గే కంటే ముందు కరోనా కేసుల తీవ్రత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మన జనాభా ప్రకారం చూసుకున్నట్లయితే కేసుల సంఖ్య అధికంగానే కనిపిస్తుందని, అయితే మిలియన్ పరంగా చూస్తే మన సంఖ్య తక్కువే అన్నారు.

కొన్ని ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్’ ప్రారంభమైందా? అని అడగ్గా... అవును.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం దీన్ని చూస్తున్నామని ఆయన తెలిపారు. కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచడంతోనే ఇది బయటపడుతోందని, ప్రతి రోజూ మిలియన్ టెస్టులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచే కొద్దీ... మరిన్ని కేసులు బయటపడతాయని ఆయన తెలిపారు.

కోవిడ్ వ్యాక్సిన్ రావడానికి మరింత సమయం పడుతుందని, అంతా కుదిరితే ఈ సంవత్సరాంతం వరకే వ్యాక్సిన్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వ్యాక్సిన్ వస్తున్నట్లు వార్తలొస్తున్నాయని, భారత్ నుంచి మూడు వ్యాక్సిన్‌లు వచ్చే అవకాశాలున్నాయని, అవి అడ్వాన్స్ స్టేజ్ అభివృద్ధిలో ఉందని తెలిపారు. వ్యాక్సిన్ సురక్షితంగా ఉండడమే ప్రధానంగా కావాల్సిందని గులేరియా స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios