Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ కులం, గోత్రం ఏంటో తెలుసా?

రాహుల్ గాంధీ...దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దేశ రాజకీయాలను శాసించే గాంధీ కుటుంబంలో పుట్టి... వారసత్వాన్ని పునికిపుచ్చుకుని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి. తాత,నాన్నమ్మ, తండ్రి ప్రధానులుగా పనిచేయగా వారి బాటలోనే తాను కూడా దేశ ప్రధాని పీఠాన్ని ఒక్కసారైనా అధిరోహించాలని రాహుల్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా రాహుల్ రాజకీయ జీవిత గురించి చాలా మందికి తెలిసివుంటుంది. కానీ ఆయన ఏ కులానికి చెందినవాడు, గోత్రం ఏమిటి  ఇలాంటి వ్యక్తిగత విషయాలు చాలామందికి తెలీదు. అయితే స్వయంగా రాహులే తన కుల, గోత్రాలను వెల్లడించిన అరుదైన సంఘటన రాజస్థాన్ లో జరిగింది. 
 
aicc president rahul gandhi caste information
Author
Pushkar, First Published Nov 26, 2018, 6:18 PM IST

రాహుల్ గాంధీ...దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దేశ రాజకీయాలను శాసించే గాంధీ కుటుంబంలో పుట్టి... వారసత్వాన్ని పునికిపుచ్చుకుని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి. తాత,నాన్నమ్మ, తండ్రి ప్రధానులుగా పనిచేయగా వారి బాటలోనే తాను కూడా దేశ ప్రధాని పీఠాన్ని ఒక్కసారైనా అధిరోహించాలని రాహుల్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా రాహుల్ రాజకీయ జీవిత గురించి చాలా మందికి తెలిసివుంటుంది. కానీ ఆయన ఏ కులానికి చెందినవాడు, గోత్రం ఏమిటి  ఇలాంటి వ్యక్తిగత విషయాలు చాలామందికి తెలీదు. అయితే స్వయంగా రాహులే తన కుల, గోత్రాలను వెల్లడించిన అరుదైన సంఘటన రాజస్థాన్ లో జరిగింది. 

రాజస్థాన్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున  జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పుష్కర్ లోనిబ్రహ్మ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించిన రాహుల్ పూజారులు అడగ్గా తన కుల, గోత్రాలేమిటో చెప్పారు. తనది కౌల్ బ్రాహ్మణ కులమని, దత్తాత్రేయ గోత్రమని రాహుల్ వెల్లడించారు. 

గత కొంత కాలంగా రాహుల్ కులగోత్రాలపై బిజెపి పార్టీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రశ్నలకు జవాబివ్వకుండా ఇన్నిరోజులు మౌనంగా వున్న రాహుల్ ఇవాళ వాటిని బైటపెట్టారు. ఇలా ఒకేసారి అటు బిజెపికి తగిన విధంగా జవాబివ్వడంతో పాటు పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తిచేశారు.    

Follow Us:
Download App:
  • android
  • ios