తమిళనాడులో అన్నాడీఎంకే నేత ఇలంగోను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన ఇంటి సమీపంలోనే కత్తులతో దాడిచేసి హత్య చేశారు.  

తమిళనాడు : తమిళనాడులో అన్నాడీఎంకేకు చెందిన ఓ ముఖ్య నేత దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అన్నాడీఎంకే ముఖ్య నేతను హత్య చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేత దారుణ హత్యకు గురవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. చెన్నైలోని పెరంబుర్ కు చెందిన ఇలంగోను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఇలంగో ఇంటి సమీపంలోనే దుండగులు అతని మీద కత్తులతో దాడి చేశారు. 

ఈ హత్యకు రాజకీయ విభేదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇలంగో హత్యలో మొత్తం ఎనిమిది మందికి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనుమానితులుగా ఉన్న 8 మందిలో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, ఇలంగో మాజీ సీఎం ఈపీఎస్ వర్గానికి చెందిన ముఖ్య నేత. ఇలంగో ప్రస్తుతం పెరంబురు నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్నారు.

న్యాయస్వేచ్ఛను గౌరవించడం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభం.. రాహుల్ గాంధీ కేసును గమనిస్తున్నాం - అమెరికా