Asianet News TeluguAsianet News Telugu

Ahmednagar: మరో నగరం పేరు మార్చనున్న మహారాష్ట్ర సర్కార్.. ఇంతకీ ఆ నగరమేంటీ..?

మహారాష్ట్రలో మరో నగరం పేరు మార్చనున్నట్టు సీఎం ఏకనాథ్ షిండే  ప్రకటన చేశారు. ఇప్పటికే ఔరంగాబాద్ పేరును ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ‘ధరాశివ్’గా పేరు మార్చిన విషయం తెలిసిందే. తాజాగా అహ్మద్‌నగర్ జిల్లా పేరును మార్చనున్నారు.

Ahmednagar in Maharashtra to be renamed Ahilyanagar KRJ
Author
First Published Jun 1, 2023, 5:15 AM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలోనే నడుస్తున్నారు.నగరాల పేరు మార్చేందుకు పనిలో పడ్డారు. ఇప్పటికే ఔరంగాబాద్ పేరును ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ‘ధరాశివ్’గా పేరు మార్చిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో నగరం పేరు మార్చుతున్నట్టు సీఎం ఏకనాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. 
ఇటీవల అహ్మద్ నగరలో జరిగి ఓ కార్యక్రమంలో ఏక్‌నాథ్ షిండే ప్రసంగిస్తూ.. అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యాదేవి హోల్కర్‌గా మార్చబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

అహల్యా దేవి హోల్కర్ 298వ జయంతి సందర్భంగా ఏకనాథ్ షిండే ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. అహల్యాదేవి హోల్కర్ ఇంటిపేరు షిండే అని, నేను కూడా షిండే అని వేదికపై ముఖ్యమంత్రి అన్నారు. మీ అందరి డిమాండ్ ను, అహల్యాదేవి హోల్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకే అహ్మద్‌నగర్ పేరును 'అహల్యానగర్'గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ, తమ హయాంలోనే పేరు మార్పు నిర్ణయం తీసుకోవడం  అదృష్టమని షిండే అన్నారు.  పేరు మార్చడం ద్వారా నగర ప్రతిష్ట మరింతపెరుగుతుంది. సామాన్యులకు న్యాయం చేసే ప్రభుత్వం తమదనీ, అహ్మద్‌నగర్ లో రాజకీయాలు చేయాలని చూస్తున్న వారేనని రోహిత్ పవార్‌ను ఉద్దేశించి షిండే అన్నారు.   షిండే-బిజెపి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రజల మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తోంది.

అహల్యాబాయి హోల్కర్ ఎవరో తెలుసా?

అహల్యాదేవి హోల్కర్ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో 1725వ సంవత్సరంలో జన్మించారు. మాల్వా రాజ్యానికి ఆమెగా వ్యవహరించారు. అహల్యాదేవికి చిన్నప్పటి నుంచి ప్రజలకు సహాయం చేయాలనే తపన ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే (1733) ఖండేరావుతో వివాహమైంది. అయితే 1754 సంవత్సరంలో ఖండేరావు యుద్ధంలో వీరమరణం పొందారు. ఆ తర్వాత అహల్యాదేవిని హోల్కర్‌కు సామ్రాజ్యాధిపత్యం అప్పగించారు. అహల్యాదేవి హోల్కర్ భారతదేశ చరిత్రలో అత్యుత్తమ రాణులలో ఒకరిగా పరిగణించబడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ధర్మశాలలను నిర్మించిన ఘనత అహల్యా బాయి హోల్కర్‌కు దక్కుతుంది. ఆమె 1795 ఆగస్టు 13న తుది శ్వాస విడిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios