Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ల డ్రామా: మీ వాడు చచ్చాడని ఓసారి, బతికే ఉన్నాడని మరోసారి..

తాజాగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ అధికారుల నిర్లక్ష్యం ఒక కుటుంబానికి ప్రత్యక్ష నరకం చూపెట్టింది. తొలుత కరోనా వైరస్ తో కుటుంబ పెద్ద మరణించాడు అని చెప్పి శవాన్ని అందించిన ఆసుపత్రి వర్గాలు తరువాత ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పడంతో వారు అంత్యక్రియలు నిర్వహించింది ఎవరికో అర్థం కాక షాక్ కు గురయ్యి ఆసుపత్రికి తమ కుటుంబ పెద్ద బ్రతికే ఉన్నాడు అన్న ఆనందంతో ఆసుపత్రికి వెళితే.... ఆ శవం ఆ కుటుంబ పెద్దదే అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. 

Ahmedabad Civil Hospital Negligence: Trauma For The Deceased Family
Author
Ahmedabad, First Published Jun 1, 2020, 7:45 AM IST

కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రపంచంలోని అని దేశాలతోపాటుగా భారతదేశంపై కూడా ఈ మహమ్మారి విరుచుకుపడుతూ అనేకమందిని పొట్టనబెట్టుకుంటుంది. 

తాజాగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ అధికారుల నిర్లక్ష్యం ఒక కుటుంబానికి ప్రత్యక్ష నరకం చూపెట్టింది. తొలుత కరోనా వైరస్ తో కుటుంబ పెద్ద మరణించాడు అని చెప్పి శవాన్ని అందించిన ఆసుపత్రి వర్గాలు తరువాత ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పడంతో వారు అంత్యక్రియలు నిర్వహించింది ఎవరికో అర్థం కాక షాక్ కు గురయ్యి ఆసుపత్రికి తమ కుటుంబ పెద్ద బ్రతికే ఉన్నాడు అన్న ఆనందంతో ఆసుపత్రికి వెళితే.... ఆ శవం ఆ కుటుంబ పెద్దదే అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. 

వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో ఒక వ్యక్తి కరోనా వైరస్ చికిత్స నిమిత్తం చేరాడు. అతడు కరోనా వ్యాధితో మరణించాడని చెప్పి కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించారు. శవం పూర్తిగా పిపిఈ లో చుట్టి ఉండడంతో కుటుంబ సభ్యులు ఎవరు అనే విషయం చూడకుండానే ఖననం చేసారు. 

ఈ తతంగం అంతా ముగిసి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్న తరువాత ఆ సదరు కుటుంబీకులకు ఫోన్ చేసి, వారి కుటుంబ పెద్ద కోలుకున్నారని, జనరల్ వార్డుకు తరలించామని అన్నారు. 

ఆ ఫోన్ రావడంతో ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తమ కుటుంబ పెద్ద బ్రతికి ఉంటే... వారు అంత్యక్రియలు ఎవరికీ చేశామని వారు విస్తుపోయారు. సరే తమ కుటుంబ పెద్ద బ్రతికే ఉన్నాడు అన్న సంతోషంతో ఆసుపత్రికి చేరుకుంటే.... అక్కడ వారికి ఆసుపత్రి వర్గాలు మరో షాక్ ఇచ్చింది. 

తాము పొరపాటుగా ఫోన్ చేశామని, ఆ వ్యక్తి మరణించాడని, ఆ శవాన్ని వారి కుటుంబానికి అప్పగించామని చావు కబురు చల్లగా చెప్పారు. ఆ వార్త విని మరో సారి హతాషులయ్యారు కుటుంబ సభ్యులు. 

ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యానికి ఆ కుటుంబం అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతం. తమ కుటుంబ పెద్ద బ్రతికున్నాడో మరణించాడా అర్థం కాక, తాము అంత్యక్రియలు ఎవరికీ చేసామో తెలియక, ఆయన బ్రతికేఉన్నదన్న ఆశతో ఆసుపత్రికి వెళితే... లేదు ఆయన మరణించాడు అన్న వార్త విని ఆ కుటుంబం పడ్డ వేదన పగవారికి కూడా రాకూడదంటున్నారు అక్కడి ప్రజలు. 

Follow Us:
Download App:
  • android
  • ios