Encounter in Jammu: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు ఉగ్రవాదులు భద్రత బలగాల మధ్య ఎన్‌కౌంటర్లతో జమ్మూకశ్మీర్ దద్దరిల్లిపోయింది. సుంజ్వాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరు ఫిదాయీల(ఆత్మాహుతి దళాలు)ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దాడిలో సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఎస్సై ఒకరు మరణించినట్టు అధికారులు తెలిపారు.
Encounter in Jammu: ప్రధాని మోడీ పర్యటనకు నేపథ్యంలో కశ్మీర్‌లో ఉగ్ర వాదులు కలకలం సృష్టించారు. ఉగ్రదాడులకు యత్నించారు. కశ్మీర్ లో ఉగ్రవాదులు - భద్రత బలగాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బారాముల్లా జిల్లా లోని సుంజ్వాన్‌లో ఈ ఎన్ కౌంటర్ గురువారం రాత్రి జరిగింది. ఈ దాడిలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరు ఫిదాయీల(ఆత్మాహుతి దళాలు) ఉగ్రవాదులను కాల్చిచంపాయి. ఈ ఎన్ కౌంటర్ లో సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఎస్సై ఒకరు మరణించినట్టు అధికారులు తెలిపారు.
జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ కథనం ప్రకారం.. గురువారం ఆర్ ఎస్ సెక్టార్ నుంచి ఇద్దరు పాక్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారు. గురువారం సాయంత్రానికి వారు ఆత్మాహుతి దాడికి యత్నించారు. ఏకే-47, గ్రనేడ్ లాంచర్ అండర్ బ్యారెల్ తుపాకులు, ఇతర మందు గుండు సామాగ్రి గల జాకెట్ ధరించి.. ఆత్మహుతికి సిద్దంగా ఉన్నారు. వారు శుక్రవారం తెల్లవారుజామున సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్ వద్ద 15 మంది సీఐఎ్‌సఎఫ్ జవాన్లతో వెళ్తున్న ఓ బస్సుపై గ్రనేడ్ లాంచర్‌తో దాడి చేశారు. వెంటనే తేరుకున్న బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలోఇద్దరు జైషే మహ్మద్ (జేఈఎం) సంస్థకు చెందిన ఉగ్రవాదులు సీఐఎస్‌ఎఫ్ ఏఎస్సై ఎస్.పి.పటేల్ వీరమరణం పొందారని డీజీపీ వివరించారు. ఈ ఎన్ కౌంటర్ లో సివిల్ సొసైటీ ఫోరమ్ (CSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ జరిగింది.
ఈ ఆపరేషన్ మొత్తం రాత్రే జరిగింది, ఇందులో ఇద్దరు పాకిస్తాన్ ఆధారిత జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు తొలుత గ్రనేడ్లు విసిరి తర్వాత కాల్పులు ప్రారంభించారు. దీంతో సైన్యం అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. 2018 ఫిబ్రవరి 10న సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని పర్యటనకు ముందే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. జమ్మూ శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించే భారీ కుట్రలో ఇది ఒక భాగం. ప్రధాని పర్యటనను విధ్వంసం చేసే పెద్ద కుట్రలో ఇది కూడా ఒక భాగం కావచ్చని శ్రీ సింగ్ అన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో గ్రెనేడ్లతో సహా భారీ ఆయుధాలు, మందులు, తినుబండారాలు వంటి ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పంచాయితీ రాజ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం జమ్మూలోని సాంబ పర్యటనకు వెళ్లనున్నారు. పంచాయితీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
