మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఆయన చాలా సీనియర్ నేతని, అయితే వ్యవసాయ చట్టాల విషయంలో వాస్తవాలు మాట్లాడటం లేదని తోమర్ అన్నారు.

గతంలో ఇవే చట్టాల్ని తీసుకురావాలని పవార్ ప్రయత్నించారని, అయితే ఇప్పుడు అవే చట్టాలపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. వ్యవసాయ చట్టాలపై ఆయన వైఖరి మారుతుందని, వాటి వల్ల కలిగే మేలును ప్రజలకు ఆయన తెలియజేస్తారని తోమర్ ఆకాంక్షించారు.

కాగా, ‌వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రెండు నెల‌లుగా ఆందోళ‌న సాగిస్తున్న అన్న‌దాత‌ల‌కు మ‌ద్ద‌తుగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్ నిలిచారు.

కేంద్ర చ‌ట్టాల వ‌ల్ల రైతులు ఆదాయం కోల్పోవ‌డంతోపాటు క‌నీస మ‌ద్ద‌తుధ‌ర కింద పంట‌ల సేక‌ర‌ణ మౌలిక వ‌స‌తుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని, మండీ వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌హీన ప‌రుస్తుంద‌ని ప‌వార్ శ‌నివారం ట్వీట్ చేశారు. 

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు ఢిల్లీలో రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీలో హింస జ‌రిగిన త‌ర్వాత ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా శ‌ర‌ద్‌ప‌వార్ మాట్లాడ‌టంతో .. యూపీఏ హ‌యాంలో వ్య‌వ‌సాయ మంత్రిగా ప్ర‌తిపాదించిన వ్య‌వ‌సాయ బిల్లుల‌ను సాకుగా తీసుకుని ప‌వార్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు చేసింది. మ‌న్మోహ‌న్ సింగ్ హ‌యాంలో ప్ర‌తిపాదించిన సంస్క‌ర‌ణ‌ల‌నే త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ద‌ని ఆరోపించింది.