వారు తమ కారును ఇంటి బయట నిలిపివుంచుతుంటారు. గురువారం ఉదయం వారికి ఆ కారు బోనెట్ లాక్‌లో నాలుగడుగుల కొండ చిలువ కనిపించింది.
కారు బోనెట్ లో చిక్కుకున్న ఒక కొండ చిలువ దూరింది. దీంతో.. దానిని చూసిన స్థానికులు భయపడిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగ్రాలో గల ఎల్ఐసీ కాలనీలో ఒక కారు బోనెట్‌లో పెద్ద కొండచిలువ చిక్కుకుంది. దానిని చూసిన ఆ కారు యజమాని, కుటుంబ సభ్యులు హడలెత్తిపోయారు. ఈ వార్త తెలుసుకున్నవారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైల్డ్ లైఫ్ టీమ్‌కు సమాచారం అందించారు. వారు అతి కష్టం మీద ఆ కొండచిలువను కారు బోనెట్ నుంచి బయటకు తీయగలిగారు.
తరువాత దానిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. ఈ కాలనీలో గురుమీత్ సింగ్ సోఢీ కుటుంబం ఉంటోంది. వారు తమ కారును ఇంటి బయట నిలిపివుంచుతుంటారు. గురువారం ఉదయం వారికి ఆ కారు బోనెట్ లాక్‌లో నాలుగడుగుల కొండ చిలువ కనిపించింది. దీంతో వారికి ప్రాణాలు పోయినంతపనైంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు.
వారు ఆ కొండచిలువను కదిలించే ప్రయత్నం చేశారు. అయితే అది అక్కడి నుంచి ఏమాత్రం కదలలేదు. దీంతో వారు ఈ విషయాన్ని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ టీమ్‌కు తెలియజేశారు. వారు అరగంటపాటు రెస్క్యూచేసి, ఆ కొండచిలువను బయటకు తీశారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 26, 2020, 9:59 AM IST