ప్రియురాలితో బలవంతంగా రాఖీ కట్టేంచేందుకు ప్రయత్నించడంతో ఓ యువకుడు పాఠశాల భవనం నుంచి దూకాడు. అగర్తలాకు చెందిన 18 సంవత్సరాల దిలీప్ అనే యువకుడు తన పాఠశాలలో చదువకుంటున్న మరో యువతి ప్రేమించుకుంటున్నారు. 

ప్రియురాలితో బలవంతంగా రాఖీ కట్టేంచేందుకు ప్రయత్నించడంతో ఓ యువకుడు పాఠశాల భవనం నుంచి దూకాడు. అగర్తలాకు చెందిన 18 సంవత్సరాల దిలీప్ అనే యువకుడు తన పాఠశాలలో చదువకుంటున్న మరో యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యజమాన్యం దాకా వెళ్లడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించింది.

ఈ క్రమంలో ప్రిన్సిపాల్‌తో పాటు తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో ఆ యువతి చేత దిలీప్‌కు రాఖీ కట్టించాలని ప్రయత్నించారు. దీనికి ప్రేయసి, ప్రియులు ఇద్దరూ ససేమిరా అన్నారు. అయినప్పటికీ పాఠశాల యజమాన్యం ఒత్తిడి చేయడంతో యువకుడు వెంటనే పాఠశాల రెండో అంతస్తు‌కి వెళ్లి పై నుంచి దూకేశాడు.

అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యజమాన్యం చర్యపై ఇతర విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.