Asianet News TeluguAsianet News Telugu

మ‌ళ్లీ అధికారం మాదే.. భూపేంద్ర ప‌టేల్ సీఎంగా కొన‌సాగుతారు: గుజ‌రాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్

BJP: గుజ‌రాత్ బీజేపీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ పాటిల్.. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంచి పని చేసారు.. మరోసారి ఆయ‌నే ముఖ్య‌మంత్రి అవుతారు అని అన్నారు. గ‌తేడాది సెప్టెంబరులో విజయ్ రూపానీ నిష్క్రమణ తర్వాత పటేల్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
 

Again the power is ours; Bhupendra Patel will continue as CM: Gujarat BJP chief CR Patil
Author
First Published Oct 2, 2022, 11:31 AM IST

Gujarat: గుజరాత్ లో మ‌ళ్లీ బీజేపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ రాష్ట్ర బీజేపీ యూనిట్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అన్నారు. ఒక టీవీ ఛాన‌ల్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ బీజేపీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంచి పని చేసారు.. మరోసారి ఆయ‌నే ముఖ్య‌మంత్రి అవుతారు అని అన్నారు. గ‌తేడాది సెప్టెంబరులో విజయ్ రూపానీ నిష్క్రమణ తర్వాత పటేల్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 

కాగా, ఏడాది చివ‌ర్లో గుజరాత్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎలాగైనా అక్క‌డ అధికారం ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ప్ర‌యాత్నాల‌ను ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలోనే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. అధికార పార్టీ బీజేపీకి గ‌ట్టి స‌వాలు విసురుతోంది. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూప‌డంతో పాటు.. ఆప్ పాలిత రాష్ట్రాల న‌మూనా గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. బీహార్ ఎన్నిక‌ల్లో గెలుపు బూస్ట్ తో గుజ‌రాత్ లోనూ పాగా వేయాల‌ని ఆప్ భావిస్తోంది. ఆప్ దూకుడుపై స్పందించిన సీఆర్ పాటిల్.. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి పోటీ లేద‌ని అన్నారు. ఆప్ స‌వాళ్ల‌ను కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే రెండో స్థానంలో కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రూపానీ మాట్లాడుతూ.. బీజేపీ హైకమాండ్ త‌న‌ను రాత్రికి రాత్రే రాజీనామా చేయ‌మ‌ని కోరింద‌నీ, అయితే, దీనికి గ‌ల కార‌ణాల‌ను తాను అడ‌గ‌లేద‌ని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, ఇద్దరు మంత్రులు, రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోడీకి రెండు ముఖ్యమైన శాఖలు- రెవెన్యూ, రోడ్లు & భవనాలు కేటాయించారు. అయితే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎందుకు తొల‌గించారు అనే ప్ర‌శ్న‌కు పాటిల్ స‌మాధాన‌మిస్తూ.. "ఎన్నికలు జరగబోతున్నప్పుడు, పనులు వేగంగా జరగాలి. అయితే, ఇది ఒక సమస్యగా మారింది. దీని కార‌ణంగానే మార్పులు నిర్ణ‌యం తీసుకున్నాం.  ముఖ్యమంత్రికి రెండు శాఖలు అప్పగించం.. దీంతో సంబంధిత నిర్ణయాలు వేగంగా తీసుకోబడతాయి" అని అన్నారు. హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించగా, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జగదీష్ విశ్వకర్మకు రోడ్లు, భవనాలు కేటాయించారు. త్రివేది, మోడీల ఇతర పోర్ట్‌ఫోలియోలను కొనసాగించారు. 

అలాగే, బీజేపీ గెలుపున‌కు సంబంధించిన కొన్ని బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని చెప్పిన సీఆర్ పాటిల్..  "ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాస్టర్ ప్లానింగ్" వంటివి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంలో సహాయపడతాయని ఆయ‌న అన్నారు. అలాగే, రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల ఎంపిక‌.. టిక్కెట్ల పంపిణీని అంశాల‌ను ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల‌కే వదిలేస్తామని ఆయ‌న చెప్పారు. “టిక్కెట్ ఆశించే వారందరి బయోడేటాను వారికి అందజేయాలని నిర్ణయించుకున్నాను. వారికి ప్రతి కార్యకర్త తెలుసు... మేము పూర్తి నిర్ణయాన్ని వారికే వదిలివేస్తాము. ఆ విధంగా, నిర్ణయం ఆమోదం కోసం ఢిల్లీకి వెళ్లి ఉంటే, టికెట్ నిరాకరించబడిన ఎవరూ బాధపడరు”అని పాటిల్ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios