పెళ్లి చూపుల్లో వరుడి అందమైన క్రాఫ్‌ చూసి పెళ్లి చేసుకుందో యువతి. తీరా పెళ్ళైన ఐదేళ్ళ తర్వాత అది క్రాఫ్‌ కాదు విగ్గు అని తెలుసుకుంది. దీంతో షాక్ తిన్న భార్య.. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారంటూ.. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. విగ్గున్న మొగుడొద్దని, పెళ్ళికి తీసుకున్న కట్నం డబ్బులు తిరిగి ఇచ్చేయలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విచిత్రమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. చెన్నై ఆలపాక్కంకు చెందిన రాజశేఖర్‌కు 2015లో  27 ఏళ్ల యువతితో పెళ్లైంది. అప్పటికే రాజశేఖర్‌ది బట్టతల కావడంతో పెళ్లి చూపులకు విగ్‌ పెట్టుకుని వెళ్ళాడు. అయితే అతనిది విగ్ అని వధువుతో సహా ఎవ్వరూ గుర్తు పట్టలేకపోయారు. 

పెళ్లైన ఐదేళ్ల తరువాత ఇటీవల అది క్రాఫ్ కాదని, విగ్గని భార్యకు తెలిసి షాక్ అయింది. దీంతో కొద్ది రోజులుగా దంపతుల మధ్య గత గొడవలు మొదలయ్యాయి. పెళ్ళిలో కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలను వాపసు ఇవ్వాలని ఆ భార్య డిమాండ్ చేసింది. 

ఈ క్రమంలో ఆమెపై భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి దాడి చేశారు. దీనితో తనని విగ్‌ పెట్టుకుని మోసగించిన భర్త రాజశేఖర్ మీద, అత్తింటి వారిపై చర్య తీసుకోవాలంటూ భాదిత మహిళా చెన్నై తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.