పలు రాష్ట్రాల్లో మల్లీ పెరిగిన చలి.. వచ్చే వారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?
New Delhi: ఉత్తర భారతంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. దీనికి ఇటీవల కురిసిన వర్షాలే కారణమని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో చలి మరింత పెరిగిందని ఐంఎండీ తెలిపింది.

Weather Update-IMD: దేశంలో మళ్లీ పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. దీనికి ఇటీవల కురిసిన వర్షాలే కారణమని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో చలి మరింత పెరిగిందని ఐంఎండీ తెలిపింది.
భాతర వాతావరణ విభాగం (ఐఎండీ) నివేదికల ప్రకారం.. దేశంలోని వాయువ్య రాష్ట్రాల్లో తీవ్రమైన చలి నుంచి కొంత ఉపశమనం లభించనుంది. వచ్చే ఐదు-ఆరు రోజుల్లో వాయువ్య భారతదేశంలో చలిగాలులు వచ్చే అవకాశం లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం (జనవరి 31) తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం, రెండు రోజుల క్రితం యాక్టివ్ వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ఉంది. దీని కారణంగా హిమాలయ ప్రాంతాలలో చాలా చోట్ల వర్షం-మంచు కురుస్తోంది.
50 నుంచి 60 సెంటీ మీటర్ల మేర మంచు కురుస్తున్నట్లు సమాచారం అందిందని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. వాయువ్య భారతదేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని మైదానాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కూడా వర్షాలు కురిశాయి. ఇప్పుడు వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ తొలగిపోయిందని మేము భావిస్తున్నాము. ఆది, సోమవారాల్లో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత తగ్గింది.
వర్షం తర్వాత మళ్లీ పెరిగిన చలి..
ఉత్తర భారత రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాల తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య గాలులు దిగువ స్థాయిలో వీస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ తెలిపారు. ఫలితంగా, వాయువ్య భారతదేశం చుట్టూ చాలా చోట్ల 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఒకటి నుండి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మళ్లీ చలి తీవ్రత పెరిగిందని తెలిపింది.
ఉష్ణోగ్రతల్లో మార్పులు ఎలా ఉంటాయంటే..?
తాజాగా వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ సమీపిస్తోందని, ఇది బలహీనంగా ఉందని పేర్కొన్న వాతావరణ నివేదికలు.. హిమాలయాల ఎత్తైన శిఖరాలపై మాత్రమే తేలికపాటి మంచు కురుస్తుందని వెల్లడించాయి. ఇది వాయువ్య భారతదేశంలోని ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది, దీని ఫలితంగా 48 గంటల తర్వాత వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రత మళ్లీ రెండు నుండి మూడు డిగ్రీలు పెరగవచ్చు. ఉష్ణోగ్రత గురించి డాక్టర్ నరేష్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు, గరిష్టంగా 20 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
కర్ణాటకలో తేలికపాటి వర్షం..
కర్ణాటకలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) మంగళవారం తెలిపింది. అలాగే, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందనీ, 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉంటాయని పేర్కొంది. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు లాంటి పరిస్థితులను చూడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.