Asianet News TeluguAsianet News Telugu

శివసేనతో ఫడ్నీవీస్ భార్య ట్వీట్ వార్ ..యాక్సిస్ బ్యాంక్ కి ఎసరు..?

శివసేన ఆధీనంలో ఉన్న థానే మున్సిపల్ కార్పొరేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారి ఆర్థిక లావాదేవీలను యాక్సిస్ బ్యాంక్ చూసుకుంటుండగా ... అక్కడి నుంచి తమ ఖాతాను నేషనలైజ్డ్ బ్యాంక్ కి మార్చుకోవాలని భావిస్తున్నారు. 
 

After Shiv Sena-Amruta Fadnavis Duel, Civic Body To Shift Axis Bank Account
Author
Hyderabad, First Published Dec 27, 2019, 2:06 PM IST

ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల చాలా రసవత్తరంగా సాగాయి. బీజేపీ రాత్రికి రాత్రే అధికారం చేపట్టింది. కానీ... శివ సేన కూటమితో  చేతులు కలపడంతో... ఫడ్నవీస్... మళ్లీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ, శివసేన ల మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఇటీవల.. శివనేస పార్టీకి చెందిన ప్రియాంక చతుర్వేదీ... మాజీ సీఎం ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపించుకున్నారు.

ఈ నేపథ్యంలో శివసేన ఆధీనంలో ఉన్న థానే మున్సిపల్ కార్పొరేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారి ఆర్థిక లావాదేవీలను యాక్సిస్ బ్యాంక్ చూసుకుంటుండగా ... అక్కడి నుంచి తమ ఖాతాను నేషనలైజ్డ్ బ్యాంక్ కి మార్చుకోవాలని భావిస్తున్నారు. 

దానికీ... అమృతా ఫడ్నవీస్ కి సంబంధం ఏమిటా అనే అనుమానం కలుగుతుందా..? ఇంతకీ మ్యాటరేంటంటే... యాక్సెస్ బ్యాంక్ లో కొన్ని సంవత్సరాలుగా అమృత ఫడ్నవీస్ సీనియర్ పోజిషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాంక్ నుంచి లావాదేవీలు జరపడాన్ని శివసేన ఇష్టడపడం లేదు. ఈ క్రమంలోనే యాక్సిస్ బ్యాంక్ నుంచి నేషనలైజ్డ్ బ్యాంక్ కి మార్చుకోవాలని భావిస్తున్నారు. 

ఇప్పటివరకు మహారాష్ట్ర పోలీస్ అధికారుల సాలరీ ఎకౌంట్స్ అన్నీ యాక్సెస్ బ్యాంక్ నుంచే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా... అమృత ఫడ్నవీస్ కారణంగా... ఆ ఖాతాలన్నీ వేరే బ్యాంక్ కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రూ.1100కోట్ల ఆర్థిక లావాదేవీలను శివసేన పార్టీ... ఆ బ్యాంక్ నుంచి జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పుడు వీటన్నింటినీ యాక్సిస్ బ్యాంక్ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios