ఎలక్ట్రికల్ బైక్ లలో మంటలు చెలరేగడం... ఉన్నఫలాన కాలిపోయే ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి వాడకం, కొనుగోలు ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా తమిళనాడులో రోడ్డు పక్కన ఆపి ఉన్న ఈ-బైక్ మంటల్లో ఆహుతయ్యింది.

చెన్నై : ప్రపంచవ్యాప్తంగా oil prices పెరుగుతున్న తరుణంలో Electric Scooter అమ్మకాలు జోరందుకున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఎలక్ట్రిక్ వాహనం రంగంపై ఇటీవల జరిగిన సంఘటనల వల్ల నీలినీడలు అలుముకున్నాయి. గత కొద్ది రోజుల క్రితం Ola ఎలక్ట్రిక్, Okinawa ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు చనిపోయారు. అయితే, ఈ సంఘటనలు మరచిపోకముందే చెన్నైలో ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి.

చెన్నైలో మంటలు చెలరేగుతున్నాయి. ఈ స్కూటర్ వీడియోను ‘ది ఎకనామిక్ టైమ్స్’ కు చెందిన సుమంత్ బెనర్జీ ట్వీట్ చేశారు. కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల భద్రత గురించి ఈ సంఘటన తర్వాత మరింత ఆందోళన చెందుతున్నారు. సుమంత్ బెనర్జీ ట్వీట్ చేసిన వీడియోలో రద్దీగా ఉండే రహదారి పక్కన పార్క్ చేసిన ఎరుపు రంగు ప్యూరీ ఈవీ ద్విచక్రవాహనంలో నుంచి దట్టమైన పొగలు రావడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు నాలుగు రోజుల్లో 4 జరిగాయని సుమంత్ బెనర్జీ పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే, కొద్ది రోజుల క్రితం ఓలా ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగిన రెండు సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వాహనదారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసే విధంగా వాటిపై భారీ రాయితీలు కూడా అందిస్తోంది. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు తగ్గించడానికి కేంద్రం సంఘటనపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించింది. పూణే లో జరిగిన ఒక సంఘటనలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు తమిళనాడులోని వెల్లూరులో ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకున్నాయి.

ఇదిలా ఉండగా, మార్చి 26న తమిళనాడులో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ బైక్ లో మంటలు చెలరేగి తండ్రీకూతురు మృతి చెందారు. తమిళనాడు వెల్లూరు జిల్లాలోని చిన్న అల్లాపురమ్​లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతులను ఎం.దురైవర్మ (49), అతని కూతురు మోహన ప్రీతి(13)గా గుర్తించారు. వేలూరు జిల్లా చిన్న అల్లాపురం ప్రాంతానికి చెందిన దురైవర్మ కొద్ది రోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. 

ఆ రోజు రాత్రి ఇంటి ప్రాగంణంలోని పాత సాకెట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌ చార్జర్‌ని అమర్చి నిద్రపోయాడు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ-బైక్‌కు మంటలు చెలరేగాయి. దీంతో ఇళ్లంతా పొగలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే బ్యాటరీలో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగడంతో ఇల్లంతా పొగవ్యాపించి దురైవర్మ, అతని కూతురు ఇంట్లోంచి బయటకు వచ్చే వీలులేకుండా పోయింది. దీంతో వారు ఇంట్లోని బాత్‌రూమ్‌లో తలదాచుకున్నారు. అయితే ఊపిరి ఆడకపోవడంతో మృతిచెందారు. 

Scroll to load tweet…