కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ జ్యోత్ సింగ్ సిద్ధూ ఇంటికి బిహార్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధూ ఇంటి ముందు పోలీసులు నోటీసులు అంటించారు. ఆయనపై గతంలో పోలీసు కేసు నమోదవ్వగా.. దానికి ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులు అంటించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ ఒక సంఘంపై సిద్ధూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు  సిద్దూపై కేసు నమోదైంది.

జూన్ 18 నుండి, బీహార్ పోలీసులకు చెందిన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు బెయిల్ బాండ్ పేపర్‌పై సంతకం పొందడానికి రోజూ 4-5 గంటలు మిస్టర్ సిద్దూ నివాసం వెలుపల వేచి ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం స్పందించలేదు. దీంతో ఇంటికి నోటీసులు అంటించినట్లు పోలీసులు చెప్పారు.