Asianet News TeluguAsianet News Telugu

దేశంలో వ్యాపారం చేయాలనుకుంటారా? లేదా?..  వాట్సాప్‌కు కేంద్రం వార్నింగ్ !

వాట్సాప్‌ లైవ్ స్ట్రీమింగ్‌లో భారతదేశం మ్యాప్ తప్పుగా చూపబడింది. దీంతో వాట్సాప్‌పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో, వ్యాపారాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారో.. ఈ  దేశానికి సంబంధించిన సరైన మ్యాప్‌ను ఉపయోగించాలని హితవు పలికారు. 

After Minister Warning Over Wrong Map Of India, WhatsApp Deletes Tweet
Author
First Published Dec 31, 2022, 10:49 PM IST

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భారతదేశం యొక్క తప్పుడు మ్యాప్‌ను ఉపయోగించి వాట్సాప్ కొత్త వివాదాన్ని సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ను హెచ్చరించింది. ఈ విషయంపై దృష్టి సారించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వాట్సాప్‌కు అల్టిమేటం జారీ చేశారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శనివారం (డిసెంబర్ 31) న్యూ ఇయర్ సెలబ్రేషన్ లైవ్ స్ట్రీమింగ్ లింక్‌లో భారతదేశం యొక్క తప్పు మ్యాప్‌ను సరిచేయాలని వాట్సాప్‌ను ఆదేశించారు.కొద్దిసేపటికే వాట్సాప్ ప్రత్యుత్తరం ఇస్తూ.. క్షమాపణలు చెప్పింది. ఆ తరువాత ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించినట్టు తెలిపింది.

అసలేం జరిగిందంటే.. 

మెటా యాజమాన్యంలోని వాట్సాప్, జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ ఇటీవల తన ట్విటర్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానిలో పెట్టిన భారత దేశ మ్యాప్‌లో  జమ్మూ-కశ్మీర్ ను తప్పుగా చూపించబడింది. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. భారతదేశంలో వ్యాపారం చేస్తున్న అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సరైన మ్యాప్‌లను ఉపయోగించాలని మంత్రి స్పష్టంగా చెప్పారు.

భారత దేశ మ్యాప్ విషయంలో జరిగిన పొరపాటును సాధ్యమైనంత త్వరగా సరిదిద్దాలని వాట్సాప్‌ను కోరారు. మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేస్తూ ..'ప్రియమైన వాట్సాప్, మీరు వీలైనంత త్వరగా భారతదేశం యొక్క మ్యాప్ యొక్క లోపాన్ని పరిష్కరించండి. భారతదేశంలో వ్యాపారం చేసే లేదా భారతదేశంలో వ్యాపారం కొనసాగించాలనుకునే అన్ని ప్లాట్‌ఫారమ్‌లు సరైన మ్యాప్‌ని ఉపయోగించాలి.' అని సూచించారు.

వాట్సాప్ క్షమాపణలు 

కొద్ది గంటల అనంతరం.. వాట్సాప్ రిప్లై ఇస్తూ..  మా ఈ తప్పును ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు అని రాశారు. ఆ మ్యాప్ ను స్ట్రీమింగ్‌ నుంచి తీసివేసాము.  పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. వాట్సాప్ లైవ్ స్ట్రీమ్ ట్వీట్‌లో భారతదేశం యొక్క తప్పు మ్యాప్‌ను చూపించిందని చెప్పండి.

వాట్సాప్ షేర్ చేసిన గ్రాఫిక్స్ మ్యాప్‌లో POK, చైనా క్లెయిమ్‌లోని కొన్ని భాగాలు భారతదేశం నుండి విడిగా చూపించబడ్డాయి. కొంత సమయం తరువాత..యువాన్ స్పందించి, తన అధికారిక ఖాతా నుంచి వివాదాస్పద ట్వీట్‌ను తొలగించారు. ఈ అనుకోకుండా జరిగిన పొరపాటు చోటుచేసుకుంది. సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios