చాలా మందికి కుక్కలను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంట్లో పిల్లలతో సమానంగా కుక్కలను చూసుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే... ఓ ఫ్యామిలీ కూడా అలానే కుక్కలను పెంచుకుంది. వీధి కుక్కలకు సైతం ఆహారం అందించేవారు. అయితే.. ఆ కుక్కలను అపార్ట్ మెంట్ లోకి అనుమతించడం వల్ల .. అవి అందరిపై దాడి చేయడం మొదలుపెట్టాయి. దీంతో.. స్థానికులంతా ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుడ్ గావ్ కి  చెందిన ఓ కుటుంబం వీధి కుక్కలకు ఆహారం అందించేవారు. వాటిని అపార్ట్ మెంట్ లోకి రావడానికి అనుమతించి మరీ.. ఆహారం అందించేవారు. అయితే.. ఆహారం కోసం వచ్చిన ఆ కుక్కలు.. స్థానికులపై దాడులు చేయడం మొదలుపెట్టాయి. చిన్నారులపై కూడా ఈ కుక్కలు దాడి చేశాయి.

 

దీంతో... సదరు కుటుంబం పై స్థానికులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. స్థానికులను అదుపు చేయడానికి పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. చిరవకు సదరు కుటుంబాన్ని బంధీలుగా కూడా చేశారు. కాగా.. పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. కాగా.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.