బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ  కీలక ములుపులు తిరుగుతోంది. ఈ కేసులో భాగంగానే బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలువురు సినీ తారల పేర్లు బయటకు వచ్చాయి. రకుల్, సారా అలీఖాన్, దీపికా పదుకొణే లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా బటయకు వచ్చాయి. వీరి తర్వాత  మరో హీరోయిన్   దియా మీర్జా పేరు కూడా బయటకు వచ్చింది. కాగా.. తన పేరు బయటకు రావడం పట్ల దియా మీర్జా స్పందించింది.

డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దియా మీర్జా పేర్కొంది. తనపై వస్తున్న వార్తలన్నీ తప్పుడువేనని ఆమె పేర్కొంది. తాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేసింది. 

కాగా.. దియా మీర్జా మేనేజర్ డ్రగ్స్ సరఫరా చేసేవాడంటూ వార్తలు వచ్చాయి. గతేడాది సైతం దియా.. తన మేనేజర్ చేత డ్రగ్స్ తెప్పించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే ఎన్సీబీ అధికారులు.. ఆమెకు సమన్లు పంపే అవకాశం ఉందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. 

ఇదిలా ఉండగా..  నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్‌ మేజేజర్‌ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చింది. 

జయ వాట్సాప్‌ చాట్‌ సమాచారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్‌ కరిష్మా డ్రగ్స్‌ గురించి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారు. ఎన్‌సీబీకి లభ్యమైన డ్రగ్స్‌ సరఫరాదారుల ఫోన్లలోని వాట్సాప్‌ కోడ్‌ చాట్‌లను బట్టి..డ్రగ్స్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ ప్రముఖుల్లో ప్రధానంగా కె, డి, ఎస్, ఎన్, జెల పేర్లు ఉన్నాయి.
 అందులో ఉన్న కోడ్‌ భాషలో ‘డీ’ అంటే దీపిక అని, ‘కే’ అంటే కరిష్మా అని అనుమానిస్తున్నారు. ఎన్‌సీబీ దీపికా మేనేజర్‌ కరిష్మాకు సమన్లు జారీ చేసింది. జయా సాహా ఇచ్చిన సమాచారాన్ని బట్టి నిర్మాత మధు మంతెనకు కూడా సమన్లు జారీ చేసింది.