Asianet News TeluguAsianet News Telugu

మొన్న డీఏ.. నేడు హెచ్ఆర్ఏ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రోజుల వ్యవధిలో డబుల్‌ బొనాంజా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెంచాలని కేంద్రం శనివారం నిర్ణయం తీసుకుంది. పెరిగిన హెచ్‌ఆర్‌ఏ రేట్లను 2021 ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఉద్యోగులు నివసించే ప్రాంతాల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉండనుంది.

After DA Hike Centre Announces Another Bonanza For Lakhs of Govt Employees ksp
Author
New Delhi, First Published Jul 17, 2021, 6:47 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రోజుల వ్యవధిలో కేంద్రం మరో తీపికబురును అందించింది. ఇప్పటికే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న  కరువు భత్యాన్ని (డీఏ) 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొ బొనాంజాను ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెంచాలని కేంద్రం శనివారం నిర్ణయం తీసుకుంది. పెరిగిన హెచ్‌ఆర్‌ఏ రేట్లను 2021 ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఉద్యోగులు నివసించే ప్రాంతాల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉండనుంది. హెచ్‌ఆర్‌ఏ పెంపులో భాగంగా మూడు రకాల కేటగిరీ ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది.  

‘ఎక్స్’ కేటగిరీ నగరాల్లో నివసించేవారికి, పెంపు 27 శాతం ఉంటుంది. ఆతర్వాత ‘వై’, ‘జెడ్’ నగరాల్లో నివాసితులకు వరుసగా 18 శాతం, 9 శాతం హెచ్‌ఆర్‌ఏ పెంపును నిర్ణయించింది. డీఏ 50 శాతం దాటినప్పుడు, హెచ్‌ఆర్‌ఏ రేట్లు వరుసగా 30%, 20% , 10% కు సవరించబడతాయి. అంతకుముందు X, Y,  Z నగరాల్లో వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉండేది.


X, Y,  Z నగరాల ప్రాతిపదిక ఇదే: 

  • 50 లక్షలకు పైగా జనాభా ఉంటే - (X కేటగిరి నగరాలు) 
  • 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే- (Y కేటగిరి నగరాలు) 
  • 5 లక్షల కన్నా తక్కువ జనాభా ఉంటే - (Z కేటగిరి నగరాలు)
Follow Us:
Download App:
  • android
  • ios