Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ను వణికిస్తున్న మరో వ్యాధి: అహ్మదాబాద్‌లో 9 మంది మృతి

గుజరాత్ రాష్ట్రంలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. మ్యూకోర్మైకోసిస్ అనే అరుదైన శిలీంద్ర వ్యాధితో 9 మంది మరణించారు.మరో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

After Covid-19, another disease strikes Ahmedabad: 44 hospitalised, 9 dead lns
Author
Ahmedabad, First Published Dec 18, 2020, 2:06 PM IST

గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్రంలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. మ్యూకోర్మైకోసిస్ అనే అరుదైన శిలీంద్ర వ్యాధితో 9 మంది మరణించారు.మరో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇప్పటివరకు 44 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.  దేశ రాజధానిలో రెండు రోజుల క్రితం ఓ 
ఆసుపత్రిలో 12 కేసులు నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.50 ఏళ్లపై బడినవారే కరోనా నుండి కోలుకొన్నవారిలోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. 

కరోనా నుండి కోలుకొన్నవారే మ్యూకోర్మైకోసిస్ బారిన పడే  ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి బారినపడిన వారంతా మెదడుతో పాటు పలు అవయవాలు పనిచేయకుండా పోతాయని నిపుణులు చెబుతున్నారు.

ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ చెప్పారు.గతంలో ఈ వ్యాధిని జైగోమైకోసిస్ అని పిలిచేవారు. ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదమైందన్నారు. ముక్కు నుండి ప్రారంభమై కళ్లకు సోకుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios