Asianet News TeluguAsianet News Telugu

Covid 19 : మళ్లీ 4 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు, 40వేలకు పైనే కొత్త కేసులు...

గడచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.29 కోట్లు దాటింది. ఇదే సమయంలో 36,385 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వరకు 3.21 కోట్ల మంది  కోవిడ్ ను జయించగా… రికవరీ రేటు 97.43 శాతంగా ఉంది.

After 25 days, India s active Covid cases set to top 4 lakh on Kerala surge
Author
Hyderabad, First Published Sep 4, 2021, 11:08 AM IST

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40 వేల పైనే ఉంటున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా మరో 42,618 మంది వైరస్ బారిన పడ్డారు. క్రితం రోజు (45,352)తో పోలిస్తే 6 శాతం తక్కువ కేసులు నమోదు చేయడం కాస్త ఊరటనిస్తుంది.  మరణాలు కూడా 400  దిగువగానే ఉన్నాయి.  అయితే కొత్త కేసులు పెరగడంతో దేశంలో క్రియాశీల కేసులు మళ్లీ నాలుగు లక్షలు దాటడం గమనార్హం.

గడచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.29 కోట్లు దాటింది. ఇదే సమయంలో 36,385 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వరకు 3.21 కోట్ల మంది  కోవిడ్ ను జయించగా… రికవరీ రేటు 97.43 శాతంగా ఉంది.  నిన్న మరో 330 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.  వైరస్ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు నాలుగు లక్షల నలభై వేల 225 మందిని బలితీసుకుంది.

మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండడంతో యాక్టివ్ కేసులు మళ్లీ నాలుగు లక్షలు దాటాయి.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 మంది  వైరస్ తో  బాధపడుతుండగా…  క్రియాశీల రేటు 1.23 శాతంగా ఉంది.  కరోనాా ఉధృతి ఎక్కువగా ఉన్న కేరళ లో నిన్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.  అక్కడ  29,322  కొత్త కేసులు బయటపడగా…. 130 ఒక మరణాలు నమోదయ్యాయి.

కాగా, దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 58.85 లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 67.72 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios