Asianet News TeluguAsianet News Telugu

శ్రద్ధా హత్య కేసులో కీలక పురోగతి.. నార్కో పరీక్ష పూర్తి.. నేరాన్ని అంగీకరించిన నిందితుడు..

శ్రద్ధా హత్య కేసు: దేశవ్యాప్తంగా సంచలన రేపుతోన్న శ్రద్ధా వాకర్ కేసులో కీలక పురోగతి జరిగింది. తాజాగా నిందితుడికి రోహిణి ఆసుపత్రిలో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. హత్య తర్వాత శద్ద్రా శరీర భాగాలను అడవిలో పడేసినట్లు అఫ్తాబ్ అంగీకరించాడు.  అతను చాలా కాలం క్రితం నుండే ఆమెను చంపడానికి ప్లాన్ చేసినట్టు తెలిపాడు.  

Aftab Confessed To Killing Shraddha, Using Multiple Weapons In Narco Test
Author
First Published Dec 1, 2022, 5:17 PM IST

శ్రద్ధా హత్య కేసు: దేశవ్యాప్తంగా సంచలన రేపుతోన్న శ్రద్ధా వాకర్ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. బుధవారం జరిగిన పాలిగ్రాఫ్ పరీక్షలో శ్రద్ధాను హత్య చేసింది తానేనని నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా.. నిందితుడు అఫ్తాబ్ కు నార్కో టెస్టు గురువారం ఢిల్లీలోని రోహిణిలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఆసుపత్రిలో జరిగింది. అఫ్తాబ్ నార్కో పరీక్ష 1 గంట 50 నిమిషాల పాటు కొనసాగింది. పరీక్షల అనంతరం నిందితుడు అఫ్తాబ్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ పరీక్షలో కూడా తాను శద్ద్రాను  శ్రద్ధను చంపినట్లు 
మరోసారి అంగీకరించాడు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. నిందితుడు అఫ్తాబ్ పరీక్షలో అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు ఆంగ్లంలో సమాధానాలు చెప్పారు. అదే సమయంలో అఫ్తాబ్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొంత సమయం తీసుకున్నాడు. కానీ ప్రశ్నలు పదే పదే పునరావృతం చేయడంతో అతను సమాధానం చెప్పాడు. పరీక్ష సమయంలో అఫ్తాబ్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని తెలుస్తుంది. 

హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు

నార్కో పరీక్షలో శ్రద్ధను హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ అంగీకరించాడు. అంతే కాదు.. శ్రద్ధా శరీరాన్ని ముక్కలు చేయడానికి ఏ ఆయుధాలు ఉపయోగించాడో, వాటిని ఎక్కడ విసిరాడో కూడా అఫ్తాబ్ చెప్పాడంట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పరీక్ష సమయంలో అఫ్తాబ్.. పలుమార్లు తెలివిగా వ్యవహరించడాన్ని తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీసుల మాటకు కట్టుబడి ఉన్నానని, విచారణకు సహకరిస్తున్నానని కోర్టు తెలియజేశాడు. అతడు పాలిగ్రాఫ్ ,నార్కో పరీక్షలకు కూడా అంగీకరించారు. కానీ, అతని ప్రవర్తనపై ఇప్పటికి  పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అఫ్తాబ్‌కి మరో పరీక్ష  

అఫ్తాబ్‌కు సంబంధించిన నార్కో పరీక్షను ఇవాళ  ఎఫ్‌ఎస్‌ఎల్ పూర్తి చేసిందని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. పరీక్షలో ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చెందిన సైకాలజిస్టులు, టెక్నీషియన్లు, ఫోటో నిపుణులు, అంబేద్కర్ ఆసుపత్రి వైద్య బృందం పాల్గొన్నారు. నార్కో తర్వాత మరో పరీక్ష ఉంటుందని చెప్పారు. దీని కోసం, నిందితుడు అఫ్తాబ్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తీసుకురానున్నారు, అక్కడ అతనికి కౌన్సెలింగ్ ఇవ్వబడుతుంది. ఇప్పటికే అఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష చేశారు.దీని తుది నివేదిక కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే..  శ్రద్ధను తానే హత్య చేశానని ఒప్పుకున్న అఫ్తాబ్ లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని పోలీసు అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios