Asianet News TeluguAsianet News Telugu

అసోంలో భయపెడుతున్న మరో వైరస్: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

: దేశంలో కరోనాతో పాటు మరో వైరస్ కూడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పందుల ద్వారా ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను ఆదేశించింది.
 

African Swine Fever in India: The Virus Remains with No Culling lns
Author
New Delhi, First Published Sep 24, 2020, 10:32 AM IST


దేశంలోని అసోం రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. ముజులి, గోలఘాట్, కమ్రూప్ మెట్రోపాలిటన్ సిటీల వరకు వ్యాప్తి చెందింది.

అసోంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఈ వైరస్ ప్రభావం ఉన్నట్టుగా నిపుణులు గుర్తించారు.

అసోం రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బారినపడిన 12 వేల పందులను చంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే పందుల పెంపకందారులను ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. పందుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించనుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 18 వేల పందులు మృత్యువాతపడ్డాయి.

పశు సంవర్థక శాఖాధికారులతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శర్వానంద్ సోనేవాల్ అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించారు.  రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ జిల్లాల్లో పందులను చంపేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. 

2019 నాటికి అసోంలో మొత్తం 21 లక్షల పందులను చంపేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios