Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేను చూసి.. టీకా వేస్తాడనుకుని..డ్రమ్మువెనుక దాక్కున్న మహిళ...!

కరోనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన బృందాన్ని చూసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ టీకాకు భయపడి డ్రమ్ వెనక దాక్కుంది. టీకా మీద అవగాహన కల్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా ఆరోగ్య శాఖ బృందంతో కలిసి మంగళవారం చందన్ పూర్ గ్రామానికి వెళ్లారు. 

Afraid of COVID-19 Vaccine, Uttar Pradesh Woman Hides Behind Drum - bsb
Author
Hyderabad, First Published Jun 3, 2021, 3:20 PM IST

కరోనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన బృందాన్ని చూసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ టీకాకు భయపడి డ్రమ్ వెనక దాక్కుంది. టీకా మీద అవగాహన కల్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా ఆరోగ్య శాఖ బృందంతో కలిసి మంగళవారం చందన్ పూర్ గ్రామానికి వెళ్లారు. 

ఈ క్రమంలో హరిదేవి (80) అనే ఓ మహిళ టీకా వేసే బృందాన్ని చూసి మొదట తలుపు వెనక దాక్కుంది. ఆ తరువాత ఇంట్లో ఉండే ఓ పెద్ద డ్రమ్ము వెనక్కి పరిగెత్తింది. దీంతో ‘నేను డాక్టర్ ని. కానీ, మీకు ఇంజెక్షన్ ఇవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు. మీతో మాట్లాడటానికి మాత్రమే ఇక్కడ ఆగాం. కనీసం వచ్చి మీ ఎమ్మెల్యే చెప్పేది వినండి’ అంటూ కోరారు. 

దీంతో ఎలాగో బైటికి వచ్చిన ఆ మహిళ ఎమ్మెల్యేని కలిసింది. కానీ వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1.18 కోట్ల వ్యాక్సిన్ లు కేంద్ర ప్రభుత్వం నుంచి అందినట్టు సమాచారం. రాష్ట్రంలో మొత్తం జనాభాలో 2శాతం మాత్రమే టీకాలు తీసుకున్నారు.

23 కోట్ల జనాభా ఉన్న యూపీలో ఇప్పటివరకు 35 లక్షల మందికి మాత్రమే టీకాలను వేశారు. ఇక వ్యాక్సిన్ లమీద ఉండే అపోహలతో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ప్రజలు టీకాలు వేయించుకోవడానికి భయపడుతున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios