అక్కడి పరిస్ధితులు ఎలా వున్నాయో ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచి వస్తున్న వారి మాటల్లో స్పష్టమవుతోంది. తాజాగా ఆఫ్ఘాన్‌కు చెందిన నరేందర్ సింగ్ ఖాస్లా అనే సెనేటర్ ఢిల్లీకి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.  

తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజులు గడిచే కొద్ది తాలిబన్లలోని రాక్షసులు బయటకు వస్తుండటంతో ఆఫ్ఘన్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు అక్కడి వారు ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రయత్నిస్తున్నారు. అక్కడి పరిస్ధితులు ఎలా వున్నాయో ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచి వస్తున్న వారి మాటల్లో స్పష్టమవుతోంది. తాజాగా ఆఫ్ఘాన్‌కు చెందిన నరేందర్ సింగ్ ఖాస్లా అనే సెనేటర్ ఢిల్లీకి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. 20 ఏళ్లుగా కష్టపడి చేసుకున్న అభివృద్ధి, దశాబ్దాలుగా నిర్మించుకున్న నమ్మకం అంతా ధ్వంసమైందని ఆయన ఆవేదన చెందారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక విమానంలో ఆఫ్ఘాన్‌కు చెందిన ఇద్దరు సెనేటర్లు సహా 24 మంది సిక్కులు ఆదివారం ఉదయం ఢిల్లీకి సమీపంలోని హిందోన్ ఎయిర్‌ బేస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందని నరేందర్ సింగ్‌ను మీడియా ప్రశ్నించింది. 

Also Read:Afghan crisis: కాబూల్ విమానాశ్రయం వద్ద తాలిబాన్ల కాల్పులు... ఏడుగురు మృతి

కాగా, వాయుసేనకు చెందిన సీ-17 అనే ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా 168 మంది పాసింజర్లను ఆఫ్ఘాన్ నుంచి ఇండియాకు తరలించిన సంగతి తెలిసిందే. ఇందులో 107 మంది భారతీయులే. అలాగే తరలింపు కార్యక్రమాల కోసం కాబుల్ నుంచి భారత్‌కు ప్రతిరోజూ రెండు విమానాలను ప్రభుత్వం నడిపిస్తోంది. వారం రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియలో ఇప్పటికే చాలా మంది పౌరులను ఇండియాకు తరలించారు. తజకిస్తాన్, ఖతార్ నుంచి కూడా విమాన సర్వీసుల ద్వారా పౌరులను కేంద్రం భారత్‌కు తరలిస్తున్న సంగతి తెలిసిందే.