Asianet News TeluguAsianet News Telugu

Afghan crisis : కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత, అధికారుల తరలింపు...

వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నారు. 120 మందికి పైగా అధికారులు, సిబ్బందితో  వాయుసేన సి-17  విమానం కాబూల్ నుంచి బయలుదేరింది. ఎంబసీ కి చెందిన కీలక పత్రాలను కూడా భద్రంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.  ఆదివారం రాత్రి భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్ గగనతలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లి  మన దేశానికి చెందిన కొందరిని తీసుకు వచ్చినట్లు సమాచారం.  

Afghan crisis : India bringing back its envoy, other officials from Kabul
Author
Hyderabad, First Published Aug 17, 2021, 11:39 AM IST

ఢిల్లీ : తాలిబన్ల అధీనంలోకి వచ్చిన ఆప్ఘనిస్థాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఈ మేరకు భారత్ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి  సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాబూల్లోని భారత రాయబార సిబ్బంది, భద్రత విభాగాల అధికారులను తక్షణమే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నారు. 120 మందికి పైగా అధికారులు, సిబ్బందితో  వాయుసేన సి-17  విమానం కాబూల్ నుంచి బయలుదేరింది. ఎంబసీ కి చెందిన కీలక పత్రాలను కూడా భద్రంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.  ఆదివారం రాత్రి భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్ గగనతలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లి  మన దేశానికి చెందిన కొందరిని తీసుకు వచ్చినట్లు సమాచారం.  

అయితే,  దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. మరోవైపు  ఆఫ్గాన్ లో చిక్కుకున్న భారత పౌరులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  వీరందరినీ సురక్షితమైన ప్రాంతాల్లో భద్రత దళాల రక్షణ నడుమ ఉంచినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరందరినీ భారత్కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి జనం పోటెత్తడంతో భారీ ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. వీరిని నియంత్రించేందుకు అంతకుముందు యుఎస్ దళాలు కూడా గాలిలోకి కాల్పులు జరిపినట్టు నివేదికలు వెలువడ్డాయి. 

భారత్, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబూల్ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసి పోయింది. అయితే ప్రస్తుతం ఆ దేశ గగనతలాన్ని మూసివేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కాబూల్ కు విమానాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది.

తాలిబన్లు ఉగ్రవాదులే.. నిషేధం విధించిన ఫేస్ బుక్..అదే బాటలో ట్విటర్..

ఆఫ్గాన్ గగనతలాన్ని మూసివేసినట్లు విమానయాన సంస్థలకు నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి విమానాలను పంపలేకపోతున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్థాన్ గగనతలాన్ని అన్ని ఎయిర్ లైన్లకు మూసివేసినట్లు తెలిసింది. అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చే మా విమనాలను ఆఫ్గాన్ మీదుగా వెళ్లకుండా దారి మళ్లిస్తున్నాం. 

ఆ విమానాలన్నీ దోహా యూఏఈలో ఇంధనం నింపుకొని ఢిల్లీకి వస్తాయి. ఇక, ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు కాబూల్ కు విమానాన్ని పంపాలని అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు’ అని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. చికాగో నుంచి ఢిల్లీ వస్తోన్న విమానాన్ని గల్ఫ్ మీదుగా దారి మళ్లించారు. 

తాలిబన్‌లు ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. స్పీకర్, మంత్రులు ఇప్పటికే పాకిస్తాన్‌కు పారిపోయారు. తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios