Asianet News TeluguAsianet News Telugu

ఏరియల్ సర్వేలతో గ్రౌండ్ స‌మ‌స్య‌లు క‌నిపించ‌వు.. యూపీ సీఎం యోగిని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ

Uttar Pradesh: ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల విష‌యంలో త‌మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ఎప్పుడూ వెనుకాడరు. ఈసారి ఆయన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి  ఆదిత్యానాథ్ ను టార్గెట్ చేశారు. ఏరియల్‌ ఇన్‌స్పెక్షన్‌లో గ్రౌండ్‌ సమస్యలు కనిపించకపోవచ్చని ఆయ‌న పేర్కొన్నారు. 
 

Aerial surveys do not show ground problems.. BJP MP Varun Gandhi targets UP CM Yogi
Author
First Published Oct 15, 2022, 2:25 PM IST

BJP MP Varun Gandhi: ఉత్తరప్రదేశ్‌లోని చాలా జిల్లాలు ప్రస్తుతం వరదలతో దెబ్బతిన్నాయి. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన రెండు రోజుల గోరఖ్‌పూర్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు వరద బాధిత కాంపియర్‌గంజ్‌, సహజన్వా ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అయితే, పిలిభిత్‌కు చెందిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆయనను టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి యోగీపై విమర్శలు గుప్పించారు. 

 సీఎం యోగిని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ 

ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల విష‌యంలో త‌మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ఎప్పుడూ వెనుకాడరు. ఈసారి ఆయన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి  ఆదిత్యానాథ్ ను టార్గెట్ చేశారు. ఏరియల్‌ ఇన్‌స్పెక్షన్‌లో గ్రౌండ్‌ సమస్యలు కనిపించకపోవచ్చని ఆయ‌న పేర్కొన్నారు. వరుణ్ గాంధీ తన ట్వీట్ లో "ఉత్తరప్రదేశ్ వ‌ర‌ద‌ల ఊబిలో ఉంది. 37 లక్షల మందికి పైగా విద్యార్థులు పీఈటీ పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నపత్రాన్ని పరిష్కరించడం కంటే కేంద్రానికి చేరుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి దారుణ ప‌రిస్థితులు తర్వాత కూడా పరీక్ష వాయిదా వేయబడలేదు. విద్యార్థుల నిరంతర డిమాండ్, ట్రాఫిక్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు" అని ట్వీట్ చేశారు. అలాగే, ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యానాథ్ పేరుకు ప్ర‌స్తావించ‌కుండా.. ప‌రోక్షంగా ఆయ‌న తీరును త‌ప్పుబ‌ట్డారు. ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా గ్రౌండ్ లో జ‌రిగే స‌మ‌స్య‌లు క‌నిపించ‌క‌పోవ‌చ్చునంటూ సీఎంకు చుర‌క‌లు అంటించారు. 

 

యూపీ పీఈటీ (UPPET) పరీక్ష..

ఉత్తరప్రదేశ్‌లో నేటి నుంచి ఉత్త‌రప్ర‌దేశ్ పీఈటీ పరీక్ష ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఈ పరీక్షలో దాదాపు 37 లక్షల మంది అభ్యర్థులు పాల్గొంటారు. 2022-2023 సంవత్సరంలో  యూపీ ప్రభుత్వం విడుదల చేయబోయే గ్రూప్ C రిక్రూట్‌మెంట్‌ల కోసం ఈ పరీక్షలో అర్హత సాధించడం అవసరం. పీఈటీ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాల్లో కమిషన్ నిర్వహిస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లో వరదలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఈ వారం ప్రారంభం నుంచి వ‌ర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డింది. వ‌రదల కారణంగా యూపీ పీఈటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలు వరదల బారిన పడ్డాయి. నదుల నీటిమట్టం గణనీయంగా పెరగడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు తిండి, పానీయాల కొరతను ఎదుర్కొంటున్నారు. యూపీలోని దాదాపు 18 జిల్లాల్లో 1370 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. గోండాలో, ఘఘ్రా నది ప్రమాదకర మార్కు కంటే 1.8 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది, దీని కారణంగా మూడు తహసీల్ ప్రాంతాలలో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios