సారాంశం
వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని మోడీ అన్నారు. ఇలా గనుక అనకపోతే... మన దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండదని ప్రధాని అన్నారు.
74వ స్వతంత్రదినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి భారతీయులందరికి శుభాకాంక్షలు తెలిపాడు. శుభాకాంక్షలు తెలుపుతూనే కరోనా యోధులకు ధన్యవాదాలు కూడా తెలిపారు.
కరోనా యోధుల సేవలను గుర్తు చేసుకుంటూ.... ఆత్మ నిర్భర్ భారత్ వల్లే మనం ఈరోజు పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులను దేశంలోనే తయారు చేసుకోగలుగుతున్నామని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు 130 కోట్ల ప్రజలకు మంత్రంగామారిందని అన్నారు.
భారతీయులందరు ఇదే స్పూర్తితో ముందుకుసాగితే ఈ కలను త్వరలోనే మనం సాకారం చేసుకోవచ్చు అని ప్రధాని మోడీ అన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనే నిర్ణయాన్ని దీనితోపాటు తీసుకోగలిగితే భారత్ దూసుకుపోతుందని అన్నారు మోడీ.
వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని మోడీ అన్నారు. ఇలా గనుక అనకపోతే... మన దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండదని ప్రధాని అన్నారు. దేశీయ ఉత్పత్తుల తయారీదారులకు మనము ప్రోత్సాహకం అందించాలంటే... వోకల్ ఫర్ లోకల్ అవ్వడమొక్కటే మార్గమని అన్నారు.
భారతదేశం ఎన్ని సంవత్సరాలు ముడి సరుకులను ప్రపంచానికి ఎగుమతి చేస్తుందని, భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఫినిష్డ్ గూడ్స్ ఎగుమతి చేయాల్సిన సమయం ఆసన్నమయిందని, ఆత్మా నిర్భర్ భారత్ ద్వారా దేశం తనకు అవసరమైనవన్నీ తయారు చేసుకోవడంతోపాటుగా... మేక్ ఇన్ ఇండియా.... మేక్ ఫర్ వరల్డ్ అనే విధంగా రూపాంతరం చెందాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఎర్రకోట మీద నుంచి ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.