వాట్సాప్ లో అశ్లీల, శృంగార వీడియోలు షేర్ చేసుకునేవారంతా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. మేము మా వాట్సాప్ లో వీడియోలు పంపుకుంటే పోలీసులకు ఎలా తెలుస్తుందిలే అనుకుంటే పొరపాటే. వీటిపై కూడా పోలీసులు ఒక కన్నేసి ఉంచుతున్నారు. తాజాగా ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

ఎక్స్ఎక్స్ఎక్స్ పేరుతో  వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. అందులో అశ్లీల వీడియోలను షేర్ చేస్తున్నాడు ఓ వ్యక్తి.  అయితే ఆ గ్రూప్‌లో ఓ మ‌హిళ నెంబ‌ర్‌ను అనుమ‌తి లేకుండా చేర్చ‌డంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వాట్సాప్ గ్రూప్‌లో అస‌భ్య‌క‌ర సందేశాలు పంపే వారి ప‌ట్ల చ‌ర్య తీసుకోవ‌డం ముంబైలో ఇదే మొద‌టి ఘ‌ట‌న‌. 

అశ్లీల వీడియోల‌ను పంపే వ్య‌క్తిని బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల ముస్తాక్ అలీ షేక్‌గా గుర్తించారు. ఐటీ చ‌ట్టం ప్ర‌కారం అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబ‌ర్‌లో ఓ మ‌హిళ ఈ ఫిర్యాదు చేసింది. మొద‌ట్లో త‌న ఫ్రెండ్స్ వేధిస్తున్నార‌ని ఆ మ‌హిళ అనుకున్న‌ది. కానీ ఓ ప్ర‌వాహంలా పోర్న్ కాంటెంట్ రావ‌డంతో ఆమె పోలీసుల‌ను సంప్ర‌దించింది. 

గ్రూప్ స‌భ్యుల్లో త‌న‌కు ఎవ‌రూ తెలియ‌ద‌ని ఆమె చెప్పింది. పొర‌పాటును మ‌హిళ నెంబ‌ర్‌ను త‌న వాట్సాప్ గ్రూప్‌లో క‌లిపిన‌ట్లు నిందితుడు తెలిపాడు. ముస్తాక్ అలీ ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను పంపించారు. మ‌రింత లోతు ద‌ర్యాప్తు కోసం గ్రూప్‌లో ఉన్న ఇత‌ర సభ్యుల వివ‌రాలను కూడా పోలీసులు సేక‌రిస్తున్నారు.