భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే.. మహారాష్ట్రలో ఎంటర్ కానున్న రాహుల్ గాంధీ
Kamareddy: భారత్ జోడో యాత్రలో శివసేన కీలక నాయకుడు ఆదిత్య థాకరే పాలుపంచుకోనున్నారు. రాష్ట్రంలో బీజేపీ, షిండే గ్రూపు, ఎంఎన్‌ఎస్‌లను ఎదుర్కోవాలంటే మహా వికాస్ అఘాడీ బలంగా ఉండాలి. ఈ కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొంటారని సమాచారం.
Rahul Gandhi-Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం నాడు తెలంగాణలోని కామారెడ్డి నుండి 61వ రోజు 'భారత్ జోడో యాత్ర'ని పునఃప్రారంభించారు. 'పాదయాత్ర' ఐదు నెలల్లో 12 రాష్ట్రాలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 150 రోజుల్లో దాదాపు 3,500 కిలో మీటర్లు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం కామారెడ్డి నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం మహారాష్ట్రకు రానుంది. శివసేనకు చెందిన ఆదిత్య థాకరే భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. థాకరే గ్రూపు ఎమ్మెల్యే సచిన్ అహిర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు భారత్ జోడో యాత్రలో ఉద్ధవ్ థాకరే పాల్గొనే అవకాశం తక్కువగా ఉందని చెప్పారు. ఇంతకుముందు భారత్ జోడో యాత్రలో థాకరే కుటుంబం పాల్గొంటుందా లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆ తర్వాత ఈ ర్యాలీలో ఆదిత్య థాకరే పాల్గొంటారని సచిన్ అహిర్ తెలియజేశారు. ఆదిత్య థాకరే కూడా భారత్ జోడో యాత్రకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. అందుకు సంబంధించి సన్నాహాలు కూడా చేశారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో, ఉద్ధవ్ థాకరే కూడా ఇందులో శివసేన పాల్గొంటుందని తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ, షిండే గ్రూపు, ఎంఎన్‌ఎస్‌లను ఎదుర్కోవాలంటే మహా వికాస్ అఘాడీ బలంగా ఉండాలి. ఈ కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొంటారని తెలిసింది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఎన్‌సీపీ, శివసేనలకు చెందిన ప్రముఖ నేతలు హాజరవుతారని కాంగ్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించింది. ఇతర సమావేశాలు, బిజీ షెడ్యూల్ కారణంగా యాత్రలో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. భారత్ జోడో ద్వారా ప్రజలను ఏకం చేసే సంకల్పంతో సాగుతున్నదని కాంగ్రెస్ ఇదివరకు పేర్కొంది. మహారాష్ట్రంలోని ఐదు జిల్లాలు అంటే నాందేడ్, హింగోలి, వాషిం, అకోలా, బుల్దానా మీదుగా 14 రోజుల పాటు 384 కిలోమీటర్ల దూరం భారత్ జోడో యాత్ర సాగుతుంది. అకోలా జిల్లాలోని యాత్ర మార్గాల్లో రాహుల్ గాంధీ కారులో ప్రయాణించనున్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ యాత్రలో పలు సామాజిక సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.
అంతకుముందు రోజు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వ్యాప్తి చేస్తున్న విద్వేషాల నుంచి భారత్‌ను విముక్తి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. "ప్రతి యువకుడు నా యాత్రలో నిరుద్యోగం గురించి మాట్లాడారు. ఉద్యోగ అవకాశాలను నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)లను నిందించారు. రైతులు, యువత, కార్మికులు తదితరుల దయనీయమైన గాథలు నేను విన్నాను" అని రాహుల్ గాంధీ అన్నారు. 2014 నుంచి నిరుద్యోగం, ధరల పెరుగుదల ఆందోళనకర వేగంతో పెరిగిపోతున్నాయని ఆరోపించారు. వ్యవసాయ రంగం, చిన్న తరహా పరిశ్రమలు, చిరువ్యాపారులు అనేక ఉద్యోగాలు కల్పిస్తున్నారని, అయితే నోట్ల రద్దు, నకిలీ జీఎస్టీ ఆ ఉపాధి వనరులన్నింటినీ నాశనం చేశాయని ఆయన అన్నారు. కేసీఆర్ ఉపాధి కల్పనను విస్మరించి ధరణి పోర్టల్ ద్వారా భూ ఒప్పందాలపై దృష్టి పెట్టారని విమర్శించారు.