Asianet News TeluguAsianet News Telugu

వివాదంలో ఆదిపురుష్.. నిర్మాతలను హెచ్చరించిన మధ్యప్రదేశ్ మినిస్టర్

Adipurush: ఆదిపురుష్ టీజర్‌పై బీజేపీ అధికార ప్రతినిథి, నటి మాళవిక అవినాష్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు ఓం రౌత్‌పై మండిపడ్డారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోం మంత్రి న‌రోత్తం మిశ్రా సైతం ఆదిపురుష్ సినిమా నిర్మాత‌ల‌ను హెచ్చ‌రించారు. 
 

Adipurush in controversy; Madhya Pradesh minister Narottam Mishra warns producers
Author
First Published Oct 4, 2022, 3:18 PM IST

MP Home Minister Narottam Mishra: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదిపురుష్ చిత్రనిర్మాతపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. చిత్రంలో హిందూ మతం చిత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. హిందూ దేవ‌త‌లు, వ్య‌క్తుల‌ను త‌ప్పుగా చూపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు. 

వివ‌రాల్లోకెళ్తే... యంగ్ రెబ‌ల్ స్టార్, పాన్ ఇండియా న‌టుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాపై ఇప్పుడు వివాదం ముదురుతోంది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల ఆ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అప్ప‌టి నుంచి ఈ సినిమాపై వివాదాలు మొద‌ల‌య్యాయి. టీజ‌ర్ లో చూపించిన ప‌లు దృశ్యాల‌పై హిందూ వ‌ర్గాల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే, సినీ అభిమానుల నుంచి కూడా ఈ చిత్రంపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. సోషల్ మీడిమాలో ట్రోల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుటు పొలిటిక‌ల్ ర‌చ్చ కూడా మొద‌లైంది. 

మొదట బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ సినిమాలో రామాయణం గురించి తప్పుగా చూపించారని దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్ హోం మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా సైతం సినిమా ద్వారా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చిత్ర నిర్మాతను మందలించారు. చిత్రంలో హిందూ మతం చిత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, "నేను అతని (ఆదిపురుష్ చిత్రం) ట్రైలర్‌ను చూశాను. అందులో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. మా విశ్వాసానికి సంబంధించిన కేంద్ర బిందువులు బాగా చూపించబడలేదు. హనుమాన్ జీ అంగవస్త్రం తోలుతో చూపించబడింది. ఇది మ‌న‌ విశ్వాసంపై దాడి" అని పేర్కొన్నారు. 

 

"అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించాలని చిత్ర నిర్మాత ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నా.. ఆ సన్నివేశాన్ని తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని రాష్ట్ర హోంమంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు. అంతకుముందు, ఎన్ఐతో బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ మాట్లాడుతూ..  “దర్శకుడు వాల్మీకి రామాయణం, కంబ రామాయణం లేదా తులసీదాస్ రామాయణం లేదా రామాయణానికి సంబంధించిన అనేక వ్యాఖ్యానాలపై పరిశోధనను వదిలిపెట్టినందుకు నేను బాధపడ్డాను. ఎలాంటి అధ్య‌య‌నాలు చేయ‌కుండానే చిత్రం నిర్మించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

కాగా, ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రం మొదటి టీజర్-ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.  ఇందులో ప్రభాస్ రాముని పాత్ర‌లో, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా నటించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios