Asianet News TeluguAsianet News Telugu

అదానీ-హిండెన్ బర్గ్: సెబీ దర్యాప్తును సమర్ధించిన సుప్రీంకోర్టు


అదానీ-హిండెన్ బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది.  

Adani-Hindenburg order: Supreme Court says no ground to doubt SEBI probe, it won't interfere lns
Author
First Published Jan 3, 2024, 11:43 AM IST

న్యూఢిల్లీ:అదానీ -హిడెన్ బర్గ్ వివాదంలో సెబీ దర్యాప్తును    సుప్రీంకోర్టు  సమర్ధించింది. ఈ వివాదంపై సిట్ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ చర్యలను కూడ  ఉన్నత న్యాయస్థానం సమర్ధించింది.నిపుణుల కమిటీపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దర్యాప్తును బదిలీ చేయాలన్న పిటిషనర్ వాదనల్లో బలం లేదన్న సుప్రీం ధర్మాసనం.సెబీ రెగ్యులేషన్స్ పరిధిలోకి వెళ్లదలుచుకోలేదని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

 పెట్టుబడిదారులకు   ప్రభుత్వం, సెబీ రక్షణ కల్పించాలని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం అభిప్రాయపడింది.20 అంశాలపై సెబీ విచారణను పూర్తి చేసినట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది.మిగిలిన అంశాలపై రెండు మూడు నెలల్లో విచారణను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.దర్యాప్తును సెబీ నుండి సిట్ కు మార్చాల్సిన అవసరం లేదని కూడ  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా లతో కూడిన ధర్మాసనం నాలుగు పిటిషన్లపై తీర్పును వెల్లడించింది.  విశాల్ తివారీ, ఎం.ఎల్. శర్మ, కాంగ్రెస్ నేతలు జయ ఠాకూర్, అనామికా జైస్వాల్ లో ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

చట్టబద్దమైన రెగ్యులేటర్ ను ప్రశ్నించడానికి మీడియా నివేదికలు థర్డ్ పార్టీ సంస్థలపై ఆధారపడడం విశ్వాసాన్ని కల్గించదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 
వాటిని ఇన్‌పుట్‌లుగా పరిగణించవచ్చనన్నారు. కానీ సెబీ విచారణను అనుమానించేందుకు  కీలకమైన సాక్ష్యం కాదని  సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios