సినిమా పరిశ్రమలోనూ మహిళలకు రక్షణ ఉండదంటూ గత కొంతకాలంగా  వాదనలు వినపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. ఈ మేరకు మీటూ పేరిట ఉద్యమం కూడా చేపట్టారు. కాగా.. తాజాగా.. ఓ నటి కాస్టింగ్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేశారు.

తనపై కాస్టింగ్ డైరెక్టరు అత్యాచారం చేశాడని ప్రముఖ టీవీ నటి ఆరోపించింది. ఈ మేరకు ఆమె  ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కాస్టింగ్ డైరెక్టరు ఆయుష్ తివారీ పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని టీవీ నటి ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ నటి ఫిర్యాదు పై తాము ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెర్సోవా పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు సాగిస్తున్నామని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని ముంబై పోలీసులు చెప్పారు.