చెన్నై: ప్రముఖ సినీ నటి నమిత బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు.నడ్డా కాషాయం కండువా కప్పి ఆమెను పార్లీలోకి ఆహ్వానించారు. 

తెలుగు, తమిళ సినిమాల్లో నమిత నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు హీరో బాలకృష్ణ సరసన సింహా సినిమాలోనూ వెంకటేష్ నటించిన జెమిని సినిమాలోనూ ఆమె నటించారు 

పెళ్లి చేసుకున్న తర్వాత నమిత రాజకీయాల్లోకి ప్రవేశించారు తమిళనాడులో ఆమె అన్నాడియంకె కోసం ఆమె పనిచేశారు తాజాగా, ఆ పార్టీ నుంచి తప్పుకుని బిజెపిలో చేరారు.

కాగా, రాధారవి కూడా బిజెపిలో చేరారు. రాధా రవిని పార్టీలో చేర్చుకోవడంపై చిన్మయి మండిపడ్డారు. మహిళలపై గౌరవం లేని రాధారవిని బిజెపిలో చేర్చుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.