సినీనటి, తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ బీజేపీలో చేరనున్నారు. రేపు ఉదయం ఆమె కమలం కండువా కప్పుకోనున్నారు. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారామె.

ఇటీవల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీని సమర్ధిస్తూ ఖుష్బూ ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అవ్వడంతో పాటు వివరణ కోరింది.

అయితే అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు ఖుష్బూ. ఆ సమయంలో కాంగ్రెస్ వీడతారన్న వార్తలు రాగా, ఆమె ఖండించారు.