Asianet News TeluguAsianet News Telugu

మాజీ ప్రియుడ్ని కొట్టి చంపిన టీవీ నటి, కారణం ఇదే...

దేవి అనే టీవీ నటి తన మాజీ ప్రియుడిని కొట్టి చంపింది. తెగదెంపులు చేసుకున్న తర్వాత తిరిగి అపైర్ కు ఒత్తిడి చేయడంతో తన మాజీ ప్రియుడు రవిని ఆమ హత్య చేసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

Actress beats ex-boyfriend to death in Tamil Nadu
Author
Chennai, First Published Dec 31, 2019, 1:34 PM IST

చెన్నై: ఓ టెలివిజన్ నటి తన మాజీ ప్రియుడిని హత్య చేసింది. 42 ఏళ్ల వయస్సు గల ఆ నటి మొద్దుతోనూ, సుత్తితోను అతన్ని కొట్టి చంపింది. ఈ సంఘటన తమిళనాడులోని కొలత్తూరులోని ఆమె సోదరి నివాసంలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.

తిరిగి సంబంధాలను నెలకొల్పుకుందామని ఒత్తిడి చేయడంతో ఆమె అతన్ని చంపినట్లు తెలుస్తోంది.  మాజీ ప్రియుడ్ని హత్య చేసిన ఎస్ దేవి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. విచారణ తర్వాత పోలీసులు ఆమె భర్త బి. శంకరన్ ను, సోదరి ఎస్ లక్ష్మిని, లక్ష్మి భర్త సవరయ (53)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

ఫిల్మ్ టెక్నీషియన్ అయిన ఎం రవి (38)ని హత్య చేసిన ఆరోపణలను వారిపై మోపారు. నలుగురిని కూడా కోర్టు జైలుకు పంపించింది. మదురైకి చెందిన రవి ఎనిమిదేళ్ల క్రితం వచ్చాడు. టీవీ సీరియల్స్ లో చిన్నపాటి పాత్రలు పోషిస్తున్న దేవితో అతనికి పరిచయమై ఇరువురి మధ్య సంబంధం ఏర్పడింది. 

రెండేళ్ల క్రితం వారిద్దరి మధ్య నెలకొన్న సంబంధం గురించి భర్త శంకర్ కు, ఇతర కుటుంబ సభ్యులకు తెలిసింది. రవితో సంబంధాలు తెంచుకోవాలని వారు ఆమెపై ఒత్డిడి తెచ్చారు. ఆమె కోసం ఓ కుట్టు మిషన్ కొన్నారు. దానిపై ఆమె పని చేస్తూ వస్తోంది. టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటిస్తూ వస్తోంది. 

దేవి భర్త తేయ్నాంపేటలో ఫర్నీచర్ దుకాణం నడుపుతున్నడాు. ఆదివారంనాడు రవి దేవి కోసం గాలిస్తూ కొలతూరులో నివసిస్తున్న ఆమెను పట్టుకోగలిగాడు. తెల్లవారుజామున ఒంటిగంటన్నర ప్రాంతంలో రవి దేవి సోదరి లక్ష్మి (40) ఇంటికి వెళ్లాడు. దేవితో కలిసి ఉండడానికి సహాయం చేయాలని ఆమెను కోరాడు. 

ఫోన్ చేసి దేవిని లక్ష్మి తన వద్దకు పిలిచింది. దాంతో దేవి, భర్త శంకర్ పక్కనే ఉన్న లక్ష్మి ఇంటికి హుటాహుటిన వెళ్లారు. దేవిని చూడగానే తనతో రావాలని రవి అడిగాడు. దాంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో దేవి అతనిపై దాడి చేసింది. రక్తమోడుతూ రవి కుప్పకూలాడు. దేవి రాజమంగలం పోలీసు స్టేషన్ కు వెళ్లి తన నేరాన్ని అంగీకరించింది. 

పోలీసు అధికారులు లక్ష్మి ఇంటికి చేరుకుని రవిని కిల్పౌక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు హత్య కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రవి మరణానికి శంకర్, లక్ష్మి, సవరయ్య కూడా కారణమని గుర్తించారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios