న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మంగళవారం నాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంతో పాటు పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 475 అసెంబ్లీ స్థానాల్లోని 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ప్రముఖులు ఇవాళ ఉదయం నుండే బారులు తీరారు.చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో  సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

డీఎంకె చీఫ్ స్టాలిన్, ఆయన భార్య , కొడుకు ఉదయనిధితో కలిసి తేనంపేటలోని సైట్ కాలేజీలో ఓటు వేశారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ తన ఇద్దరు కూతుళ్లు శృతి హాజన్, అక్షరతో కలిసి తేనంపేటలోని చెన్నై స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విరుకాంబక్కంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇవాళ ఉదయమే ఆమె ఈ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకొన్నారు.క్యూ లైన్ లో నిల్చొని ఆమె ఓటు వేశారు.  కాంగ్రెస్ నేత పి. చిదంబరం శివగంగ జిల్లా కందనూరులోని ఓ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

తమిళన సినీ నటులు విజయ్ , సూర్య  కార్తీ, అజిత్ తదితరులు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకొన్నారు. చెన్నైలోని నీలాంకరైలో గల ఓ పోలింగ్ కేంద్రానికి విజయ్ తన ఇంటి నుండి సైకిల్ పై వెళ్లి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఓటేశారు.కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ తన భార్యతో కలిసి వెల్లేరి పోలీంగ్ కేంద్రంలో ఓటు వేశారు