తమిళ హీరో విజయ్.. రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆయన తీసే సినిమాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయంటూ ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. దీనిపై ఇప్పటి వరకు విజయ్ ఎలాంటి ప్రకటన చేయకపోగా... తాజాగా.. దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నటుడు విజయ్‌ తన పుట్టినరోజు సందర్భంగా రాజకీయంగా ప్రవేశం గురించి ప్రకటించానున్నారంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. ఈనెల 22న నటుడు విజయ్‌ పుట్టిన రోజు. సాధారణంగా ఆయన పుట్టిన రోజును అభిమానులు ముగ్గులు, ఆర్భాటాలతో ఒక ఒక పండుగలాగా  జరుపుకుంటారు. 

అలాంటిది ప్రస్తుత కరోనా కాలంలో తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించవద్దని విజయ్‌ ఇప్పటికే తన అభిమానులకు ఒక ప్రయోగం ద్వారా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌ అభిమానులు కొందరు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సంచలన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

అయితే.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు రాష్ట్రంలో కొన్ని చోట్ల పోస్టర్లు అంటించారు. ఆ పోస్టులపై తమిళ్‌ మాట్లాడుతూ మోటు శివాజీ గణేషన్, కమల్‌ హాసన్‌ సరసన నటుడు. విజయ్‌ ఫొటోను ముద్రించారు. నిజానికి విజయ్‌ నటుడు రజనీకాంత్‌ వీరాభిమాని . అలాంటిది ఆ పోస్టర్లో రజనీకాంత్‌ ఫోటో లెక పోవడం చర్చనీయాంశంగా మారింది. 

అంతే కాకుండా నటుడు విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వెల్లడిస్తారని, ఇంత కాలంగా మౌనం పాటిస్తున్న కొన్ని విషయాలను బద్ధలు కొట్టనున్నారని అందులో పేర్కొన్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఆయ పుట్టినరోజు వరకు ఆగాల్సిందే