Asianet News TeluguAsianet News Telugu

జాత్యహంకార వ్యాఖ్యలకు గురైన బాలీవుడ్ నటుడు.. తనదైన శైలిలో రిప్లే.. కట్ చేస్తే.. 

ప్రముఖ బాలీవుడ్ నటుడు సతీష్ షా లండన్ విమానాశ్రయంలో జాత్యహంకారానికి బలి అయ్యాడు. అతడిని హేళన చేసిన సిబ్బందికి దీటైన సమాధానమిచ్చారట. ఈ విషయాన్ని ఆయన  సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. షా రిప్లే ఇచ్చిన విధానాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. 

Actor Satish Shah's Response To Racist Comment At UK's Heathrow Airport Wins Internet
Author
First Published Jan 4, 2023, 6:30 AM IST

బాలీవుడ్ ప్రముఖ నటుడు సతీష్ షా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ఎంతో మంది మన్ననలు పొందారు. అయితే.. ఇటీవల ఆయన  వార్తల్లో నిలిచారు. ఆయన లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో జాత్యహంకార వ్యాఖ్యలను ఎదుర్కోవలసి వచ్చిందట. ఆ సందర్భంలో ఆయన ఎలా స్పందించారో అనే విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో కూడా పంచుకున్నారు.
 
సతీష్ షా తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేస్తూ..  లండన్లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లోని సిబ్బంది తనను ఫస్ట్ క్లాస్‌లో చూసి హీత్రూ సిబ్బంది ఆశ్చర్యపోయారని ఆయన తన ట్వీట్‌లో రాశారు. ఇలాంటి వ్యక్తులు కూడా ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు కొనుగోలు చేయగలరా ? అని ఓ వ్యక్తి తన తోటి సిబ్బందిని అడిగారు. ఆ ప్రశ్నకు విన్న షా స్పందిస్తూ.. 'ఎందుకంటే మేము భారతీయులం' అని వారికి బదులిచ్చారు.

ఈ విధంగా లండన్ హీత్రూ విమానాశ్రయంలో జాతి వివక్షపై సతీష్ షా సమాధానమిచ్చారు. దీంతో  హీత్రూ విమానాశ్రయ సిబ్బంది మాట్లాడటం మానేశారు. సతీష్ షా ట్వీట్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. చాలా మంది అతని ట్వీట్ ను లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. 

సతీష్ షా ట్వీట్‌పై ఓ నెటిజన్ ప్రతిస్పందిస్తూ..'జాత్యహంకారం హేయమైన చర్య. ఇది విదేశీయుల మనస్సులో పాతుకుపోయింది. మనలో చాలా మంది జాత్యహంకారానికి బలయ్యారని పేర్కొన్నారు. సతీష్ షా చేసిన ఈ ట్వీట్‌కు ప్రజలు జై హింద్ అంటూ స్వాగతం పలికారు. ఇది కాకుండా.. చాలా మంది తమకు జరిగిన ఇలాంటి సంఘటనలను కూడా గుర్తు చేసుకున్నారు.ఈ జాత్యహంకార వ్యాఖ్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకున్న కథలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన ట్వీట్‌కి దాదాపు 5, 48,000కు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో 608 మంది ఆయన రీట్వీట్ చేసారు. ఇది కాకుండా 7 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

దీంతో ఈ ఘటనపై   హీత్రూ విమానాశ్రయం స్పందించింది. క్షమాపణలు కోరుతూ ట్వీట్‌ చేసింది. "గుడ్ మార్నింగ్, ఈ ఎన్‌కౌంటర్ గురించి విన్నందుకు మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని డిఎమ్ చేయవచ్చా?" విమానాశ్రయం పేర్కొంది.  చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు కూడా మిస్టర్ షా జాత్యహంకార వ్యాఖ్యకు అండగా నిలిచారని ప్రశంసించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కొందరు UK ప్రభుత్వాన్ని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios