Asianet News TeluguAsianet News Telugu

రచయిత్రిగా మారిన స్మృతి ఇరానీ.. అమరజవాన్ల త్యాగాలే ఇతివృత్తంగా ‘లాల్ సలాం’ పుస్తకం...

స్మృతి ఇరానీ రచించిన తొలి నవల లాల్ సలాం ఈ నెల 29న మార్కెట్లో విడుదల కానుంది.  2010 ఏప్రిల్ లో దంతేవాడ లో 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత ఇతివృత్తంగా ఆమె ఈ పుస్తకాన్ని రచించారు. తన పుస్తకంతో దేశం కోసం దశాబ్దాలుగా సేవ చేసి ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు స్మృతి ఘనమైన నివాళులు అర్పించనున్నారు.

actor polition Smriti Irani turns author with her debut novel Lal Salaam book
Author
Hyderabad, First Published Nov 18, 2021, 5:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజకీయాల్లోకి ఆరంగేట్రానికి ముందే స్మృతి ఇరానీ బుల్లితెర నటిగా మంచి గుర్తింపు సాధించారు. కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు కూడా. 2014 లో Narendra Modi కేబినెట్ లో చోటు దక్కించుకున్న ఆమె అందరి చూపు తన వైపునకు తిప్పుకున్నారు.  2019 ఎన్నికల్లో  Amethiలో  Rahul Gandhiని మట్టికరిపించి  తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. BJPలో కీలక మహిళా నాయకురాలు  ఎదిగారు.  ప్రస్తుతం మోడీ కేబినెట్ లో  Minister of Women and Child Welfareగా  సేవలందిస్తున్న ఆమె రచయిత్రిగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.

స్మృతి ఇరానీ రచించిన తొలి నవల లాల్ సలాం ఈ నెల 29న మార్కెట్లో విడుదల కానుంది.  2010 ఏప్రిల్ లో దంతేవాడ లో 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత ఇతివృత్తంగా ఆమె ఈ పుస్తకాన్ని రచించారు. తన పుస్తకంతో దేశం కోసం దశాబ్దాలుగా సేవ చేసి ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు స్మృతి ఘనమైన నివాళులు అర్పించనున్నారు.

Westland పబ్లిషింగ్ సంస్థ  Smriti Irani రచించిన Lal Salaam పుస్తకాన్ని దేశవ్యాప్తంగా  పుస్తక ప్రియులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పుస్తకం ప్రీ ఆర్డర్స్ కూడా మొదలయ్యాయి.  కవర్ పేజీకి సంబంధించిన మోషన్ పిక్చర్ ను స్మృతి ఇరానీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  పుస్తక ఇతివృత్తం చాలా రోజులుగా తన మదిలో ఉన్నదేనని స్మృతి ఇరానీ తెలిపారు.  తన నవల పాఠకులను మెప్పిస్తుంది అని  ధీమా వ్యక్తం చేశారు.

వ్యవస్థలు, అవినీతితో యువ ఆఫీసర్ విక్రమ్ ప్రతాప్ సింగ్ ఎదుర్కొన్న ఇబ్బందులను లాల్ సలాం పుస్తకంలో స్మృతి కళ్లకు కట్టినట్లు వివరించనున్నారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ పుస్తకం పాఠకులను తప్పనిసరిగా ఆకట్టుకుంటుందని పబ్లిషర్ వీకే కార్తీక ఆశాభావం వ్యక్తం చేశారు.

మాటలతో మెస్మరైజ్ చేసే స్మృతి ఇరానీ.. ఎవ్వరిమీదైనా స్థిరంగా ఎదురుదాడి చేయగలదు. కరోనా నేపథ్యంలో, మహమ్మారి, చిధ్రమవుతున్న జీవితాలను ఆదుకోవాలంటూ, ప్రబుత్వం చర్యలు తీసుకోవాంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై ఈ జూన్ లోవిమర్శలు గుప్పించిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. 

పోక్సో చట్టం: స్కిన్ టు స్కిన్ తాకాలన్న వివరణపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘దురుద్దేశాన్ని పరిగణించాలి’

జ్ఞాన ముత్యాలను విప్పే" "జ్ఞానీ బాబా (తెలివైన సన్యాసి)" అని ఎగతాళి చేశారు.  టీకా వికేంద్రీకరణ డిమాండ్ పై కాంగ్రెస్ యూటర్న్ తీసుకొందని విమర్శించారు.  జూన్ 22 ఉదయం  కరోనా థర్డ్ వేవ్ పై రాహుల్ గాంధీ  శ్వేత పత్రం విడుదల చేశారు. కరోనా తొలి, సెకండ్ వేవ్  విషయంలో ప్రభుత్వం సరిగా ప్లాన్ చేయలేదన్నారు.

 కరోనాతో మరణించిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఈ విషయమై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కరోనా వైరస్ అంత తెలివైంది కాదని కర్ణాటక బీజేపీ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ మాదిరిగా కరోనా వైరస్ ట్రాన్స్ ఫార్మ్ కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios